పాము కాటు వేయటం ద్వారా తన కోరలతో ఏర్పరచిన గాయాన్ని పాముకాటు అంటారు. పాముకాటు విషపూరితమైనది. అయితే పాము జాతుల యొక్క అధిక భాగం విషపూరితం కానివి ఉన్నాయి, సాధారణంగా ఇవి విషంతో కంటే అదుముట ద్వారా వేటాడిన ఆహారాన్ని చంపుతాయి, విషపూరిత పాములు అంటార్కిటికా మినహా ప్రతి ఖండంలోను కనబడతాయి అయితే పాము కాటుకు గురైనప్పుడు చాలామంది యూట్యూబ్ ద్వారా నేర్చనున్న జ్నానాన్ని ప్రయత్నిస్తుంటారు.
లేదంటే ప్రథమ చికిత్స పేరుతో పుస్తకాలు చదువుతుంటారు. కానీ అలా చేయకూడదు. పాము కాటేస్తే ఏం చేయాలో నిపుణులు వివరించారు. పాము కరిచిన ప్రదేశంలో గోకకూడదు. అక్కడ దురద ఎక్కువగా ఉంటుంది. కానీ ఓపికపట్టాలి. అక్కడ కొద్దిపాటు రక్తస్త్రావం కూడా అవుతుంది. అయినా కూడా గోకడానికి ప్రయత్నం చేయకూడదు. రక్త ప్రవాహాన్ని ఆపేందుకు బ్యాండేజీని ఉపయోగిస్తే విషం ఒకే చోట గడ్డకట్టడానికి కారణం అవుతుంది. ఇది గ్యాంగ్రీన్ కు కారణం అవుతుంది.
కాబట్టి బట్టలు, తాడులను కట్టేందుకు ప్రయత్నించకూడదు. అంతేకాదు పాము కరిచిన ప్రాంతంలో మీ నోటి నుంచి విషాన్ని తొలించేందుకు ప్రయత్నించకూడదు. దంతాల మధ్య లేదా చిగుళ్ల మధ్య ఉన్న గ్యాప్ ద్వారా విషం నేరుగా మీ మెదడుకు చేరుతుంది. అది మీకు ఇంకా ప్రమాదకరం కావచ్చు. పాము కరిచిన వెంటనే ఆందోళన చెందకూడదు. ధైర్యం తెచ్చుకుని దీని కారణంగా రక్తపోటు హెచ్చుతగ్గులకు గురికాదు. పాము కరిచిన ప్రాంతాన్ని నీటితో కడగాలి. చేతితో వీలైనంత విషాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి.
పాము మీకు కనిపిస్తే వెంటనే దూరం నుంచి తీయడం మర్చిపోవద్దు. పాము కాటు తర్వాత ఆసుపత్రికి వెళ్లి సీటీబీటీ పరీక్ష చేయించుకోవాలి. కాటు విషపూరితమైనదా కదా అనేది ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు విషం లేని పాము కాటుకు గురై టీటీ ఇంజక్షన్ ఇస్తారు.విషపూరిత పాము కాటుకు తగిన చికిత్స చేస్తారు వైద్యులు. ఇలా చేస్తే ప్రమాదం నుంచి బయటపడవచ్చు.