పనిమనిషితో అఫైర్‌ పెట్టుకున్న సీనియర్ నటుడు, అందరికి తెలియడంతో భార్య షాకింగ్ డెసిషన్.

divyaamedia@gmail.com
2 Min Read

ఓంపురి భారత దేశం గర్వించదగ్గ నటుల్లో ఈయన ఒకరు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో 2017 జవనరి 6న ఈయన కన్నుమూసారు. ఈయన కన్నుమూసిన నాలుగేళ్ల తర్వాత ఈయన నటించిన ఓ సినిమా త్వరలో విడుదల కానుంది. అయితే ఓం పురి వివాహమాడిన ఇద్దరు భార్యలు వివాదంతో ఆయన నుంచి విడిపోవడం ఆయన జీవితంలో ఓ కీలక మలుపు. రెండో భార్య నందిత తాను రాసుకున్న ‘అన్ లైక్లీ హీరో’ అనే పుస్తకం ఆధారంగానే సినిమా తీస్తాను అంది. అప్పట్లో ఆమె ఈ పుస్తకావిష్కరణ చేస్తాను అంటే ఓంపురి అడ్డుకున్నాడు. ఎందుకంటే ఆ పుస్తకంలో ఆయన గురించి కొన్ని వివాదాస్పద విషయాల్ని పేర్కొనడం ఆయనకు నచ్చలేదు.

మళ్లీ ఇన్నాళ్లకు ఆ పుస్తకం లోని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. మాజీ భార్య నందిత మాట్లాడుతూ…‘‘తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సవాళ్ల గురించి ఆయన ఈ బయోగ్రఫీలో వెల్లడించారు. అలాగే వ్యక్తిగత విషయాలను తెలియజేశారు. పుస్తకం రాస్తున్నప్పుడు.. పనిమనిషితో అఫైర్‌ గురించి ఆయన చెప్పగానే.. ఇది చెప్పాల్సిన అవసరం ఏముంది? వద్దు అని నేను వారించా. కానీ, ఆయన అంగీకరించలేదు. ‘అందులో తప్పేముంది? అప్పటికి నేను పెళ్లి చేసుకోలేదు. రిలేషన్‌షిప్‌లోనూ లేను. చిన్న అఫైర్ అది. నిజాలు తెలిస్తే తప్పేంకాదు’ అని రిప్లై ఇచ్చారు. ఆయన మాట ప్రకారం అందులో అన్నీ ఆయన చెప్పిన విధంగా రాశా.

పుస్తకం విడుదలయ్యాక అందరూ ఆ విషయం గురించే ప్రస్తావించడం మొదలుపెట్టారు. అది ఆయన్ను బాగా కలచి వేసింది. ‘నా లైఫ్‌లో ఇది ముఖ్యమైన విషయం కాదు. కెరీర్‌, చిన్నతనంలో నేను ఎదుర్కొన్న సమస్యల గురించి అందరూ మాట్లాడుకుంటే బాగుండేది’ అని అన్నారు’’ అని నందిత తెలిపారు. ఈ వివాదం గురించి ఓంపురి అప్పట్లో మాట్లాడుతూ.. ‘‘అందరిలాగే నేనూ నా భార్యకు అన్ని విషయాలు చెప్పా. తన పుస్తకం అమ్ముకోవడం కోసం ఆమె ఈ విషయాలను అందులో ప్రస్తావిస్తుందని అనుకోలేదు. ఆమె ఇలాంటి విషయాలు రాసినట్లు నా దృష్టికి రాలేదు’’ అని చెప్పారు. ఆయన 66 ఏళ్ల వయసులో (2017లో) మరణించారు.

భారతీయ సినిమా రంగానికి వన్నె తెచ్చిన అర్ధ సత్య, ఆక్రోశ్, సిటీ ఆఫ్ జాయ్ వంటి ఎన్నో చిరస్మరణీయ చిత్రాల్లో నటించి నటనలో కొత్త ఒరవడి సృష్టించారు ఓం పురి . ఓం పురి నటనా వైదుష్యం కేవలం హిందీ సినిమాకే పరిమితం కాలేదు. తెలుగు, హాలీవుడ్, ఎన్నో యూరోపియన్ చిత్రాల్లోనూ ఆయన నటించి విశ్వవిఖ్యాతి గాంచారు. తెలుగులో అంకురం సినిమా ఆయన నట విశ్వరూపానికి అద్దం పట్టింది. సమాంతర సినిమా నటుడిగానే ముద్ర పడినప్పటికీ ఎన్నో కమ్మర్షియల్ చిత్రాల్లోనూ తనదైన శైలిలో భిన్నభూమికల్ని పోషించి ప్రతి ఒక్కరినీ ఆయన మెప్పించారు. ఓం పురి నటనకు గీటురాళ్లు ఆయనకు లభించిన అవార్డులే. ఆరోహణ్, అర్ధ సత్య చిత్రాలకు గాను రెండు సార్లు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *