ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా..? ఎలా మారిందో చూశారా..? ఇప్పుడేం చేస్తున్నారంటే..!

divyaamedia@gmail.com
2 Min Read

తొలి సినిమాతోనే ఎంతో స్టా్ర్ డమ్ కొట్టెసిన ఈ అలనాటి హీరోయిన్.. ఆ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు. కొన్ని మలయాళ సినిమాలు చేసినా.. ఆ తర్వాత పెళ్లి చేసుకుని లండన్ వెళ్లిపోయింది. కళ్లతోనే అందరినీ కట్టిపడేసిన ఆమె.. ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా ? .. ప్రస్తుతం ఆమె లండన్ లో ఉంటుంది. రచయితగా రాణిస్తోంది. అంతేకాకుండా.. 2005 నుంచి ఆరోగ్యం, మానవ సంబంధాలపై ఫ్రీలాన్స్ విలేకరిగానూ పనిచేస్తోంది. అయితే ఆమె ఒకప్పుడు దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్. తన అందం, అభినయంతో అడియన్స్ మనసులను కొల్లగొట్టింది.

ఇక తెలుగులో చాలామంది ఆడియెన్స్ కు ఫేవరెట్ హీరోయిన్ ఆమె. అలాగనీ ఆమె తెలుగులో పెద్దగా సినిమాలేమీ చేయలేదు. కేవలం ఒక్క సినిమాలోనే హీరోయిన్ గా కనిపించింది. అయితేనేం.. తన క్యూట్ యాక్టింగ్ తో ఆడియెన్స్ మనసులు కొల్లగొట్టింది. ముఖ్యంగా సినిమాలో పెద్ద గొంతేసుకొని ఆమె చెప్పిన డైలాగులకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే మరిన్ని సినిమాల్లో ఈ అందాల తారను చూడాలనకున్నవారికి నిరాశే ఎదురైంది. ఒకే ఒక్క సినిమాతోనే టాలీవుడ్ లో తన ప్రస్థానాన్ని ముగించింది.

మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? కష్టంగా ఉంది కదా.. అయితే మేమే సమాధానం చెబుదాం లెండి. ఆమె మరెవరో కాదు గీతాంజలి సినిమా హీరోయిన్ గిరిజా షెట్టార్. అవును.. గీతాంజలి సినిమాలో ఎంతో అందంగా కనిపించిన ఆమె ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు ‘గీతాంజలి హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి? అసలు నమ్మలేకున్నాం’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

1969లో బ్రిటన్‌లో జన్మించిన గిరిజ సెట్టార్ కు భరత నాట్యంలోనూ అనుభవముంది. 2003లో యోగా తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక మనస్తత్వశాస్త్రంలో డాక్టరల్ థీసెస్ పూర్తి చేసింది. ఇదే సమయంలో గీతాంజలి సినిమా కోసం మణిరత్నం ఆమెను ఇండియా తీసుకొచ్చారు. దీంతో పాటు మలయాళం, హిందీ భాషల్లో కూడా చెరో రెండు సినిమాల్లో నటించింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *