ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం బంగారం రేట్లు తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ప్రస్తుతం ఔన్సుకు 2503.75 డాలర్ల వద్ద కొనసాగుతోంది. కొద్ది రోజుల కిందట ఇది 2530 డాలర్ల వద్ద ఉండేది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 28.87 డాలర్ల వద్ద ఉంది. ఇక డాలర్ పతనం అవడంతో రూపాయి కాస్త మెరుగైంది. ప్రస్తుతం డాలర్‌తో చూస్తే మారకం విలువ రూ. 83.915 వద్ద ఉంది. అయితే బంగారం ధరల్లో హెచ్చు, తగ్గులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలో క్రమంగా తగ్గుదల కనిపిస్తోంది. అయితే పెరిగిన దాంతో పోల్చితే తగ్గడం చాలా తక్కువేనని చెప్పాలి. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 73 వేల వద్ద ట్రేడ్ అవుతోంది.
తాజాగా శనివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. తులంపై రూ. 10 తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగరాం ధర రూ. 67,190కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,290 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,040గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,140 గా ఉంది. ఇక మరో ప్రధాన నగరం చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,040గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,140 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతా విషయానికొస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,040గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,140 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,040గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,140 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడ విషయానికొస్తే ఇక్కడ కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,040, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,140గా ఉంది. విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,040కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,040 వద్ద కొనసాగుతోంది.
వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. శనివారం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధర తగ్గుముఖం పట్టింది. కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 87,900గా ఉండగా.. ముంబయిలో రూ. 88,300, బెంగళూరులో రూ. 87,600 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నై, కేరళ, హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 92,900 వద్ద కొనసాగుతోంది.