Nabha Nnatesh: డెడ్ పూల్ డాన్స్ తో దుమ్మురేపిన నభా నటేశ్, వైరల్ అవుతున్న వీడియో.

divyaamedia@gmail.com
3 Min Read

Nabha Nnatesh: డెడ్ పూల్ డాన్స్ తో దుమ్మురేపిన నభా నటేశ్, వైరల్ అవుతున్న వీడియో.

Nabha Nnatesh: నభా నటేష్ ఒక భారతీయ మోడల్, నటి, కన్నడ , తెలుగు చిత్రాలలో నటించింది. 1995 డిసెంబర్ 11 కర్ణాటక రాష్ట్రం చిక్ మంగళూరు జిల్లా శృంగేరిలో జన్మించింది. ఆమె మంగుళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసింది.కన్నడ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 2015 లో శివ రాజ్‌కుమార్‌తో కలిసి కన్నడ మూవీ వజ్రకాయలో నభ నటేష్ అరంగేట్రం చేశారు. అయితే రామ్ పోతినేని లవర్ గా.. ఒక ఊరమాస్ అమ్మాయిగా నభా నటేష్ చేసిన యాక్టింగ్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇటీవల ప్రియదర్శితో కలిసి డార్లింగ్ అనే మూవీ చేసింది. మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీలో.. నభా నటేష్ లేడీ అపరిచితుడి పాత్రలో మెప్పించింది.

Also Read: కంటి చూపు పోయిందని బిగ్ బాస్ బ్యూటీ ఆవేదన, కంటిచూపు సమస్యతో..?

ఇప్పుడు డార్లింగ్.. డెడ్ పూల్ అవతారం ఎత్తేసింది. ఆమె చేసిన ఈ డ్యాన్స్ నెట్టింట వైరల్ గా మారిపోయింది. ఇటీవల కాలంలో వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయిన సినిమా ఏదైనా ఉందా అంటే.. అది కచ్చితంగా డెడ్ పూల్- ఓల్వరిన్ మూవీ అనే చెప్పాలి. యాక్షన్, కామెడీ, ఎమోషన్, ఎలివేషన్స్ ఉన్న ఈ సినిమాకి ప్రేక్షకులు మంత్రముగ్దులై పోయారు. ఈ మూవీ కేవలం 6 రోజుల్లోనే 4,565 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి అందరినీ వావ్ అనేలా చేసింది.

సాధారణంగా డెడ్ పూల్ అంటే హీరో డైలాగ్స్, క్రేజీ మీమ్స్ తో వచ్చే తెలుగు డబ్బింగ్ కు బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈసారి డెడ్ పూల్ ఓల్వరిన్ చిత్రంతో.. ఒక డ్యాన్స్ మూవ్ కూడా చేసి ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చారు. మూవీ స్టార్టింగ్ లో వచ్చే ఈ డ్యాన్స్ బీట్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా వచ్చేసింది. ఆ లిస్ట్ లోకి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ కూడా చేరింది. డెడ్ పూల్ చేసిన డ్యాన్స్ బీట్ ని రీ క్రియేట్ చేసింది. క్యూట్ గా ఉండంటం.. అల్లరి చేయడం మాత్రమే కాకుండా.. తనలో ఒక బెస్ట్ డ్యాన్సర్ కూడా ఉన్నట్లు నభా నటేష్ చెప్పకనే చెప్పింది.

Also Read: తెలుగులో కోటి రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి హీరోయిన్, కానీ..!

డెడ్ పూల్ x డార్లింగ్ అంటూ ఆ డ్యాన్స్ బీట్ ని నభా తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో షేర్ చేసింది. ఆమె ఈ వీడియో పోస్ట్ చేసిన గంటలోనే వేలల్లో లైక్స్.. లక్షల్లో వ్యూస్ వచ్చేశాయి. డార్లింగ్ మూవీ నుంచి ఇంకా నభా నటేష్ బయటకు రాలేదు అనిపిస్తోంది. అంటే డార్లింగ్ అని కోట్ చేయడంతో ఫ్యాన్స్ ఇలా కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. ఇలా డెడ్ పూల్ ని గుర్తు చేస్తూ తన డ్యాన్స్ తో మెప్పించింది. మరి.. నభా నటేష్ కిల్లర్ మూవ్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *