లక్షలు కాకుండా కోట్లలో పారితోషికం తీసుకునే హీరోయిన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. కానీ తెలుగు సినీ పరిశ్రమలో మొదటిసారి రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. అయితే ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా.. ఆమె మరెవరో కాదు.. గోవా బ్యూటీ ‘ఇలియానా’. ఈమె మొదటిగా రామ్ పోతినేని నటించిన ‘దేవదాసు’ సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది.
ఇక మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. ఈ క్రమంలోనే.. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘పోకిరి’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ బ్యూటీ క్రేజ్ ఇండస్ట్రీలో అమాంతం పేరిగిపోయింది. ఆ తర్వాత ఇలియానా ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది. దాదాపు స్టార్ హీరోస్ అందరీ సరసన ఆఫర్స్ అందుకుంటూ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అంతేకాకుండా.. తెలుగు ఇండస్ట్రీలో రూ.కోటి రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోయిన్ గా ఇలియానా కావడం గమన్హారం.
కానీ, రాను రాను టాలీవుడ్ లో ఇలియానకు ఆఫర్స్ తగ్గిపోయాయి. దీంతో ఈ గోవా బ్యూటీ నెమ్మదిగా బాలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడ కూడా వరుసగా ఆఫర్స్ అందుకుంటూ.. సినిమాలు చేసింది. కానీ, అవన్నీ డిజాస్టర్స్ గా నిలవడంతో.. సినిమాలకు పూర్తిగా దూరమైంది.. దీంతో పూర్తిగా సినిమాలకు ఇటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా ఇలాయానా.. సడన్ గా తాను ప్రెగ్నెంట్ అంటూ అనౌన్స్ చేసి షాక్ ఇచ్చింది. విచిత్రం ఏమిటంటే.. ఈ బ్యూటీ పెళ్లి విషయాన్ని దాచిపెట్టి నేరుగా ప్రెగ్నెన్సీ గురించి అభిమానులతో పంచుకుంది.
ఇక ఆ తర్వాత.. తన భర్త, బాబు ఫోటోస్ షేర్ చేస్తూ వైవాహిక బంధం గురించి తన అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఇలియానా తన బాబు, భర్తతో కలిసి విదేశాల్లో ఉంటుంది. అలాగో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన బాబు ఫోటోస్ షేర్ చేస్తుంది. ఇకపోతే అప్పటిలో ఎంతో క్రేజ్ ఉన్నా హీరోయిన్ ఇలా ఇండస్ట్రీకి దూరం కావడంతో ఆమె ఫ్యాన్స్ కాస్త బాధపడుతున్నారు. కాగా, ప్రస్తుతం ఇలియానా లేటెస్ట్ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలియానా లేటెస్ట్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.