శ్రీను వైట్ల సినిమాల్లో ఎమ్మెస్ నారాయణ కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. దుబాయ్ శీను, దూకుడు సినిమాల్లో ఆయన నటన థియేటర్స్ లో నవ్వులు పూయించింది. కాగా అనారోగ్య కారణాలతో 2015 జనవరి 23వ తేదీన హైదరాబాదులో కన్నుమూశారు నారాయణ. ఎప్పుడైతే అనారోగ్యంతో ఆయన హాస్పటల్ లో చేరారో అప్పుడే అభిమానులకు ఆయన చివరి దశలో ఉన్నారని అర్ధమైపోయింది. హాస్పటల్ లో చేరిన ఎమ్మెస్ నారాయణ కోరిన చివరి కోరిక ఎదో తెలుసా.?
బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఎమ్మెస్ నారాయణ చివరి రోజుల్లో మాట్లాడలేని పరిస్థితుల్లో బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయిని అడిగి ఒక పేపర్ తీసుకొని దానిమీద బ్రహ్మ అన్నయ్యని కలవాలని రాసారు. ఆయనకు ఎంతమంది ఫ్యామిలీ, రిలేషన్స్ ఉన్నా నన్ను చూడాలని ఉందని రాసారు. దాంతో ఆయన ఆయన కూతురు నాకు ఫోన్ చేసారు. అప్పుడు నేను గోపీచంద్ సినిమా షూటింగ్ లో శంషాబాద్ లో ఉన్నాను. నేను డైరెక్టర్ ని అడిగితే వద్దంటారేమో షూట్ ఉందని అని చెప్పకుండానే వచ్చేసాను.
హాస్పిటల్ లో ఎమ్మెస్ బెడ్ మీద నుంచి నన్ను చూడగానే అతని కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయి. నా చేయి పట్టుకొని ఉన్నాడు. కాసేపటికి బయటకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి షూటింగ్ నుంచి మధ్యలో వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయాను. డాక్టర్ తో కూడా మాట్లాడి ఎంత అయినా పర్లేదు చూడండి అని చెప్పి వెళ్ళాను. ఎందుకంటే అతను నేను సంపాదించుకున్న ఆస్తి. హాస్పిటల్ నుంచి నేను షూట్ కి తిరిగి వెళ్తుంటే దారిలో ఉండగానే ఆయన చనిపోయారు అని వార్తలు వచ్చాయి అంటూ ఎమోషనల్ అయ్యారు.