Mpox Virus: ఇండియాలోకి మరో కొత్త వైరస్, చిన్నపిల్లలకు సోకితే అత్యంత ప్రమాదం.

divyaamedia@gmail.com
2 Min Read

Mpox Virus: ఇండియాలోకి మరో కొత్త వైరస్, చిన్నపిల్లలకు సోకితే అత్యంత ప్రమాదం.

Mpox Virus: ఇండియా లో మంకీపాక్స్‌ ఫస్ట్ కేసు రికార్డు అయింది. యూఏఈ నుంచి కేరళకు వచ్చిన ఓ ప్రయాణికుడిలో మంకీపాక్స్ లక్షణాలను గుర్తించారు. అతడి నమూనాలు సేకరించి పుణేలోని నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించగా.. ఫలితాల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్‌ భారత్‌కూ విస్తరించింది. అయితే కరోనా వైరస్ ఎంతోమందిని బలితీసుకుంది. దీని వ్యాప్తి తగ్గిందని ఊపిరి పీల్చుకునే లోపే వేరే ప్రాణాంతక వైరస్‌లు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆఫ్రికా దేశాల ప్రజలను ఎంపాక్స్‌ వైరస్‌ గడగడలాడిస్తోంది. మంకీపాక్స్ అని కూడా పిలిచే ఈ మహమ్మారి, మన పొరుగుదేశమైన పాకిస్థాన్‌లో కూడా అలజడి సృష్టిస్తోంది.

Also Read: షుగర్ పేషెంట్లకు ఈ డ్రింక్ అమృతంలో సమానం, ఎందుకంటే..?

ఈ అంటువ్యాధి భారతదేశంలో వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువని ఆరోగ్య నిపుణులు చెబుతున్నా సరే, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అప్పటినుంచి ఈ వ్యాధి గురించి చాలా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మంకీపాక్స్ అనేది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ఒక జూనోటిక్ వైరస్ వల్ల వచ్చే వ్యాధి. ఈ వైరస్ మొదట 1958లో కోతుల్లో, తర్వాత 1970లో మనుషుల్లో కనిపించింది. ఇది చాలా అరుదైన వ్యాధి. దీని బారిన పడిన వారికి దద్దుర్లు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మంకీపాక్స్ లక్షణాలు, స్మాల్‌పాక్స్‌ లక్షణాల మాదిరిగానే ఉంటాయి. ఈ వ్యాధి ఉన్న వ్యక్తిని తాకినా లేదా వారికి దగ్గరగా ఉన్నా.. ఇది ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది.

ఈ డిసీజ్ ఉన్న జంతువులను తాకినా, మనుషులకు సోకవచ్చు. మంకీపాక్స్ ఎంత త్వరగా వ్యాపిస్తుందో అనేది ఇన్ఫెక్షన్ స్టేజ్‌, వ్యాధి ఉన్న వ్యక్తిని ఎలా తాకామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యాధి మూడు దశల్లో వ్యాపిస్తుంది. అవి ఇంక్యుబేషన్ పీరియడ్ , సింప్టమాటిక్ పీరియడ్, వ్యాధి ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉన్న సమయం. మంకీపాక్స్ వైరస్ శరీరంలోకి వెళ్లిన తర్వాత 5 నుంచి 21 రోజుల వరకు వ్యాధి లక్షణాలు కనిపించవు. ఈ సమయంలో కూడా బాధితులకు తెలియకుండానే వ్యాధి ఇతరులకు సోకే అవకాశం ఉంది. ఈ దశలో జ్వరం, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమయంలో వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది.

Also Read: వేయించిన శనగలు తరచూ తింటుంటే చాలు, మీకు జీవితంలో గుండె జబ్బులు రావు.

దద్దుర్లు మొత్తం తగ్గిపోయి, పుండ్లు మానిపోయి పొక్కులు ఊడిపోయిన తర్వాత వ్యాధి వ్యాపించే అవకాశం తగ్గుతుంది. మంకీపాక్స్ ఉన్న జంతువుల రక్తం, శరీర ద్రవాలు లేదా పుండ్లను నేరుగా తాకితే ఈ వ్యాధి వచ్చే అవకాశం పెరుగుతుంది. జంతువులను తాకేటప్పుడు సరైన రక్షణ తీసుకోకపోతే ఈ వైరస్ సోకుతుంది. వైరస్ వేగంగా స్ప్రెడ్ అవుతున్న ప్రాంతంలో నివసించే వారికి ఈ వ్యాధి త్వరగా రావచ్చు. వైరస్ సోకిన జంతువులు లేదా మనుషులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని ప్రజలకు రిస్క్ ఎక్కువ.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *