డయాబెటిస్ అని కూడా అనబడే ఈ వ్యాధి, ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత. అతిమూత్రం (పాలీయూరియా), దాహం ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా), మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్ధకం దీని ముఖ్య లక్షణాలు. అయితే డయాబెటిస్… చాలా మందిని వేధిస్తున్న సమస్య. వయసు సంబంధం లేకుండా… చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఒక్కసారి షుగర్ వచ్చింది అంటే… చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిందే. అంతెందుకు నచ్చిన ఫుడ్ తినలేం. స్వీట్స్ తినడం అనే విషయం పూర్తిగా మర్చిపోవాల్సిందే.
జీవితాంతం మందులు మింగుతూనే ఉండాలి. మీరు కూడా ఇలానే ఫీలౌతున్నారా..? అయితే.. ఇక నుంచి ఆ సమస్య ఉండదు. ఎందుకంటే… మీరు కేవలం ఒక డ్రింక్ తాగడం వల్ల.. డయాబెటిస్ సమస్య నుంచి బయటపడొచ్చు. మీ షుగర్ వ్యాధి తగ్గిపోయి.ఎండిపోయిన అల్లంతో చేసిన ఓ డ్రింక్.. మీ షుగర్ వ్యాదిని తగ్గించగలదు. ఈ అల్లంలో రక్తంలోని చెక్కర స్థాయిలను సమతుల్యం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తాజా అల్లాన్ని ఎండపెట్టి.. దానిని పొడి చేసి మనం వాడాల్సి ఉంటుంది. ఆ పొడిని నీటిలో కలుపుకొని తాగడమే.
రెగ్యులర్ గా అల్లం నీటిని తాగడం వల్ల.. మీ బ్లడ్ షుగర్ లెవల్స్ క్రమంగా తగ్గి.. సాధారణం అవుతాయి. ఈ అల్లం వాటర్.. ఎవరైనా కూడా తాగొచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ వాటర్ తాగడం వల్ల.. జలుబు, ఫ్లూ లాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. కడుపు ఉబ్బరం సమస్య కూడా ఉండదు. బ్లడ్ షుగర్ కంట్రోల్‌లో అల్లం పాత్ర చాలా కీలకం. అల్లం వినియోగం గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లం రక్తంలో చక్కెరను నియంత్రించే యంత్రాంగాన్ని కలిగి ఉంటుంది. అల్లం కార్బోహైడ్రేట్ జీవక్రియకు కారణమయ్యే ఎంజైమ్‌లను నిరోధించవచ్చు .
రక్త జీవరసాయన పారామితులు, లిపిడ్ ప్రొఫైల్‌లను మెరుగుపరుస్తుంది. ఈ మెకానిజం రక్తంలో చక్కెర నియంత్రణ కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అల్లంలో ఉండే , జింజెరోల్స్, ఇన్సులిన్‌తో సంబంధం లేకుండా కండరాల కణాలలోకి గ్లూకోజ్ తీసుకోవడం మెరుగుపరుస్తుందని నమ్ముతారు. ఈ చర్య అధిక రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది.