ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళలో పూసలు అమ్ముకుంటూ ఆకర్షించే నవ్వుతో .. అందమైన కళ్లతో అందరిని తన చూపుతూనే తన వైపు తిప్పుకున్న అమ్మాయి మోనాలిసా. ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయిన వారిలో ఈ చిన్నది కూడా ఉంది. అయితే ఇంకేముంది సోషల్ మీడియాలో ఆమె సెన్సేషన్ అయ్యింది.
పూసలు అమ్ముకోవడానికి సైతం వీలు లేకుండా ఆమె వెంటపడి మరీ వీడియోస్, ఫోటోస్ చిత్రీకరించారు. దీంతో మహాకుంభమేళాలో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగడంతో ఆమె తన సొంతూరుకు వెళ్లిపోయింది. తేనెకళ్లతో నెటిజన్లను కట్టిపడేసిన ఆ అమ్మాయికి బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. తాను తెరకెక్కించే చిత్రంలో ఆమెకు ఓ పాత్రను ఇవ్వనున్నట్లు తెలిపారు.
ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో మోనాలిసా కనిపించనుంది. ఇప్పటికే ఆమె స్వగ్రామానికి వెళ్లి.. ఆమె కుటుంబసభ్యులను సంప్రదించారు. ఇక సినిమాకు ఆమెతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ కావడానికి మరో నెలరోజుల సమయం ఉన్నట్లు టాక్. అలాగే మోనాలిసాకు నటనలో శిక్షణ సైతం ఇవ్వనున్నారు.
ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం మోనాలిసాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. మోనాలిసా తొలి సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ గురించి చర్చ నడుస్తుంది. ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాకుగానూ ఆమెకు రూ.21 లక్షలు పారితోషికం ఇస్తున్నారట. దీనిపై ఇప్పటివరకు సరైన క్లారిటీ రాలేదు.