వామ్మో, కుంభమేళాలో మోనాలిసా 10 రోజుల్లో రూ.10 కోట్లు సంపాదించిందా..?

divyaamedia@gmail.com
2 Min Read

నిత్యం కోట్లాది మంది పాల్గొంటున్న ఈ కుంభమేళాకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతున్నాయి. అయితే కొన్ని రోజులుగా మహా కుంభమేళాలో దండలు అమ్ముకుంటున్న ఓ అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్ అయిన సంగతి తెలిసిందే. కాటుక పెట్టిన తేనె కళ్లు.. డస్కీ స్కీన్ తో అందరి చూపును ఆకర్షించింది. సహజ సౌందర్యంతో లక్షలాది మందిని ఫిదా చేస్తున్న ఆ అమ్మాయి పేరు మోనాలీసా. ఇంకేముందు చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఆ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

అయితే ఇక అక్కడ నుంచి కుంభమేళాకు వెళ్లిన ఆమె ఫ్యాన్స్ ఒకసారి కలుసుకోవడం, ఫోటోలు దిగడం, మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూలు చేయడం మొదలైపోయింది. దీనివల్ల ఆమె పని పోతుందనే ఆవేదన ఆమె వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ సమయంలో.. 10 రోజుల్లో ఆమె రు.10 కోట్ల వరకూ సంపాదించిందనే ప్రచారం నెట్టింట మొదలైంది. దీనిపై ఆమె స్పందించింది. అవును.. మహా కుంభమేళాలో దండలమ్మే మోనీ అలియాస్ మోనాలిసా సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయిపోయిన సంగతి తెలిసిందే.

ఫలితంగా.. ఆమె తన పాపులారిటీతో గడిచిన 10 రోజుల్లో సుమారు రూ.10 కోట్లు సంపాదించిందంటూ ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై మోనాలిసా స్పందించింది. ఆ ప్రచారాన్ని ఖండించింది. ఈ సందర్భంగా… తాను అంత డబ్బు సంపాదించినట్లయితే.. ఇక్కడ ఎందుకు నివసిస్తున్నాను.. ఇంకా దండలు ఎందుకు అమ్ముతున్నాను? అంటూ ఎదురు ప్రశ్నించింది. దీంతో… సోషల్ మీడియా అంటే అంతే.. ఎవరిని ఎప్పుడు ఫేమస్ చేస్తుందో.. ఎవరిపై ఎప్పుడు డ్యామేజ్ చేస్తుందో తెలియదు అనే విషయం మోనాలిసాకు తెలిసి ఉంటుందని అంటున్నారు.

వాస్తవానికి ఇండోర్ కు చెందిన మోనాలిసా తన కుటుంబంతో కలిసి మహా కుంభమేళాలో రుద్రాక్షలు, ముత్యాల దండలు అమ్ముతూ కనిపించింది. ఈ సమయంలో ఆమె లుక్స్ కి కనెక్ట్ అయిన కొంతమంది.. ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట పోస్ట్ చేసి, “మహా కుంభ్ మోనాలిసా”, “నేచురల్ బ్యూటీ” అంటూ రాసుకొచ్చారు. దీంతో ఆమెకు నెట్టింట ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ క్రమంలో యూట్యూబర్ ల నుంచి సాధారణ ప్రజల వరకు ఆమెను ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు.. ఫోటోలు తీసుకోవడం ప్రారంభించారు. ఈ సమయంలో అప్రమత్తమైన ఆమె తండ్రి.. ఈ పరిస్థితి నుంచి తన కుమార్తెను రక్షించుకోవాలని భావించి.. ఊరికి పంపించేశారు!

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *