ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఇప్పటికే ఎన్నో కోట్ల మంది భక్తులు హాజరై, పుణ్యస్నానాలు ఆచరించారు. రోజురోజుకూ ఈ కుంభమేళాకు వెళుతున్న భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్పితే.. సంఖ్య అస్సలు తగ్గడం లేదు. అయితే మహా కుంభమేళాలో పూసలమ్ముకుంటూ కనిపించి దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది మోనాలిసా. కుంభమేళా మోనాలిసా అంటూ అందరూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఏ క్షణాన అయితే ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో..అప్పటి నుంచి ఇప్పటి వరకూ వైరల్ అవుతూనే ఉన్నాయి.
పైగా రోజుకో వార్తతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ఈ యువతి. అటు సినిమా వాళ్లనీ ఇదే విధంగా అట్రాక్ట్ చేసింది. ఆమె కళ్లు చూసే అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఆమెకి ఉన్న క్రేజ్‌ని చూసి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఓ పాత్రలో నటించనుంది మోనాలిసా. ఈ మేరకు అగ్రిమెంట్‌పై సంతకం కూడా చేసింది. ఇక షూటింగ్‌కి వెళ్లడమే తరువాయి. అసలు ఎక్కడి మోనాలిసా..ఎక్కడి బాలీవుడ్. లక్ అంటే అలా ఉంటుంది మరి. ఎవరిని ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్లి కూర్చోబెడుతుందో ఎవరూ ఊహించలేరు.
ఇప్పుడు మోనాలిసా విషయంలో అదే జరిగింది. అయితే..సినిమా ఆఫర్‌పై ఈ తేనెకళ్ల సుందరి స్పందించింది. ఈ రియాక్షనే ఇప్పుడు వైరల్ అవుతోంది. “నిజం చెప్పాలంటే..ఎప్పుడెప్పుడు హీరోయిన్ అవుతానా అని ఎదురు చూశా. నాకు యాక్టింగ్ అన్నా డ్యాన్స్ అన్నా మహా ఇష్టం” అని అంటోంది మోనాలిసా. మరి నీకు ఏ యాక్టర్లు అంటే ఇష్టం అని అడిగితే..”నాకు మా అమ్మ నాన్నే బాగా ఇష్టం” అని ఆన్సర్ చెబుతూనే..సోనాక్షి సిన్హా, సల్మాన్ ఖాన్ అంటే ఇష్టమంటూ తన మనసులో మాట బయటపెట్టింది.
అయితే..ఒక్కసారిగా వచ్చిన ఈ ఫేమ్‌తో కొన్ని ఇబ్బందులూ ఎదురవుతున్నాయని చెబుతోంది మోనాలిసా. అంతా వచ్చి పదేపదే ఫొటోలు, వీడియోలు అడుగుతున్నారని, ఇది ఇబ్బంది కలిగిస్తోందని అంటోంది. కొందరైతే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని హ్యాక్ చేశారని చెప్పుకొచ్చింది. తన పేరిట ఎన్నో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారని పేర్కొంది.