రాజకీయ నేతలతో పాటుగా సినీ ప్రముఖులు వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఓ హీరోయిన్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాధారణంగా సినిమా సెలబ్రిటీలు తిరుమలకు వస్తే ఆ హంగామా వేరేగా ఉంటుంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ది మోస్ట్ క్రేజీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే ఈ బ్యూటీ పేరే వినిపిస్తుంది. గతేడాది ఆమె నటించిన అరడజనుకు పైగా సినిమాలు రిలీజయ్యాయి.
ఈ సంక్రాంతికి మరో సినిమాతో ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే తన సినిమా రిలీజ్ కు ముందు ఇలా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ బ్యూటీ మరెవరో కాదు మీనాక్షి చౌదరి. ఈ సంక్రాంతికి తెలుగులో మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందులో సంక్రాంతికి వస్తున్నాం కూడా ఒకటి. వెంకటేశ్ హీరోగా నటించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటించారు.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Actress Meenakshi Chaudhary visits Tirumala pic.twitter.com/7fnCSw75pJ
— idlebrain.com (@idlebraindotcom) January 5, 2025