70 ఏళ్ల వృద్ధుడిని ప్రేమించి పెళ్లాడిన 20 ఏళ్ల యువతి. వీరి పెళ్లి ఎంత సందడిగా జరిగిందో చుడండి.

divyaamedia@gmail.com
2 Min Read

చాలా మంది యువతీ యువకులు ప్రేమ పేరుతో తారతమ్యాలు మర్చిపోతుంటారు. దీంతో తల్లిదండ్రులు, బంధువుల నుంచి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనలు అనేకం మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం.. కానీ, యువత వృద్ధుల పట్ల ఆకర్షితులు కావడం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే 70 ఏళ్ల వృద్ధుడు, 20 ఏళ్ల యువతి మెడలో దండలు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే పలుమార్లు ఒకరి మెడలో మరొకరు పూలమాలలు మార్చుకుంటున్నారు.

ఇందులో యువతి ఎంతో ఆనందంగా ఉండటం చూస్తుంటే.. ఆమె ఇష్టప్రకారమే ఈ పెళ్లి జరిగినట్లు కనిపిస్తుంది. వరుడు ఎదురుగా నిలబడి సిగ్గుల మొగ్గ అవుతుంది వధువు. వెనుక కుటుంబ సభ్యులు పూలు జల్లి ఈ నూతన దంపతులను ఆశీర్వదిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు తమదైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. సోదరా, ఇది కలియుగం, ఏదైనా జరగొచ్చు అంటూ ఓ యూజర్ రాసుకొచ్చాడు.

గుర్రాలకు గడ్డి దొరకడం లేదంటే.. గాడిదలు చ్యవనప్రాస్ తింటున్నాయి అంటూ మరొకరు కామెంట్స్ చేశారు. ఆ వృద్ధుడు తన ఆస్తినంతా కట్నంగా ఇచ్చాడు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు అయితే ఈ మధ్య కాలంలో కొంత మంది ఫేమ్ అయ్యేందుకు ఇటువంటి వీడియోలు చేసి.. వార్తల్లో నిలుస్తున్నారు. ఒక్క రోజులో సెలబ్రిటీలు అయిపోవాలన్న ఉద్దేశంతో రీల్స్, షాట్స్ అంటూ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే ఓ వైపు ఇటువంటి సందేహం కలుగకమానదు. అమ్మాయి చేతికి గాజులు లేకపోవడంతో పాటు.. ఏదో స్కిట్‌లా కనిపిస్తుంది కూడా.

వెనుక చిన్న పిల్లలు అక్షింతలు వేస్తుండటం చూస్తుంటే.. ఇది రియల్ వివాహమా, రీల్ వివాహమా అన్న అనుమానం వస్తుంది. ఒక వేళ నిజం అయితే.. ఇక యువకులు కుళ్లుకోవాల్సిందే. పెళ్లి చేసుకునేందుకు ఆడపిల్లలు దొరకడం కష్టంగా మారిపోతున్న ఈ తరుణంలో.. తాత వయస్సున్న వ్యక్తులతో అమ్మాయిలు ప్రేమ, పెళ్లిళ్లు చేసుకుంటే బ్రహ్మాచారులు పరిస్థితి ఏం కావాలో చెప్పండి. మరీ ఈ వీడియోలో రియల్ పెళ్లేనంటారా..? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *