హిందూ వివాహం ఒక పవిత్ర కార్యం అని గతంలో గుర్తింపు నివ్వడం జరిగింది. అయితే 1956 లో హిందూ వివాహ చట్టం రూపొందించిన తరువాత, వివాహానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ గానీ, విధానంగానీ చెప్పబడలేదు. అంతే కాక హిందూ మత ఆచారానికి గుర్తింపునివ్వబడింది. హిందూ మతంలో ఉన్న విభిన్న సామాజిక వర్గాలు వేరువేరు వివాహ పద్ధతులను ఆచరించడాం జరుగుతుంది. అయితే వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇక పెళ్లి తర్వాత ఆడ, మగవారి శరీరంలో, జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా మగవారికి బాధ్యతలు పెరుగుతాయి.
పిల్లలు, సంసారం, జాగ్రత్త పెరుగుతుంది. ఇదంతా పక్కన పెడితే పెళ్లైన తర్వాత ఎక్కువ కాలం బతుకుతారని సైన్స్ చెబుతోంది. జామా నెట్ వర్క్ ఓపెన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం. పెళ్లి చేసుకున్న పురుషులలో మరణ ప్రమాదం 15% మాత్రమే ఉందంట. అదే సమయంలో బ్రహ్మచారులు, విడాకులు తీసుకున్న వారి ఆయుర్దాయం చాలా తక్కువగా ఉందని చెపుతోంది. జామా నెట్ వర్క్ ఓపెన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం. పెళ్లి చేసుకున్న పురుషులలో మరణ ప్రమాదం 15% మాత్రమే ఉందంట. అదే సమయంలో బ్రహ్మచారులు, విడాకులు తీసుకున్న వారి ఆయుర్దాయం చాలా తక్కువగా ఉందని చెపుతోంది.
50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న 6,23,140 మందిపై ఈ పరిశోధనలు జరిగాయి. వారితో మాట్లాడి వారి ఆరోగ్యంపై ఈ అధ్యయనం చేశారు. జపాన్ పరిశోధకులు ఈ పరిశోధనను 15 సంవత్సరాలలో పూర్తి చేశారు. పెళ్లైన జంటలు ప్రమాదాలు, గాయాలు లేదా గుండె జబ్బులతో మరణించే అవకాశం 20 శాతం తక్కువగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది. దీనికి కారణం లేకపోలేదు. బ్యాచిలర్ అబ్బాయిలు సంపాదన, ఎంజాయ్ పేరుతో తమ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ద చూపలేరు. అంతేకాదు రిస్క్ తీసుకోడానికి కూడా వారు వెనకాడరు. దీనివల్లే వీరి ఆయుష్షు తగ్గిపోతుందని పరిశోధకులు చెబుతున్నాయి. అదే సమయంలో పెళ్లై వారు తమ ప్రాణాలను ఎక్కువ రిస్క్ లో పెట్టరు.
ఎందుకంటే వారిని నమ్ముకొని ఇంట్లో ఓ కుటుంబం ఉందని వెనకడుగు వేస్తాయి. మద్యం ఎక్కువ సేవించరు. మాదక ద్రవ్యాల జోలికి ఎక్కగా పోరు. అందుకే వీరికి ప్రమాదాలు కూడా ఎక్కువగా జరగవు. దీనివల్ల వీరు మరణించే ప్రమాదం చాలా వరకు తక్కువగా ఉందంట. పెళ్లి తర్వాత పురుషులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి భార్య ఎప్పుడూ అండగా ఉంటుంది. అలాగే వారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త తీసుకుంటుంది.. దీంతో ఎలాంటి వ్యాధులు, అనారోగ్యానికి ఎక్కువ గురవరు అంటున్నారు నిపుణులు.