సినీ ఇండస్ట్రీలో ఎఫైర్లు, బ్రేకప్‌లు, పెళ్లిళ్లు, విడాకులు అనేవి చాలా కామన్. కానీ మనీషా కోయిరాలా తన కెరీర్లో చాలామందితో డేటింగ్ చేసిందని టాక్. హీరో వివేక్ ముశ్రన్, నానా పటేకర్, వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ.. ఒకరి తర్వాత మరొకరు.. ఏకంగా 12 మందితో ఈ బ్యూటీ సన్నిహితంగా మేలిగిందని పుకార్లు అప్పట్లో షికార్లు చేశాయి. అయితే 90వ దశకంలో ఇండస్ట్రీనీ ఓ ఊపు ఊపేసిన హీరోయిన్లలో మనీషా కొయిరాలా ఒకరు. అసలు ఈ బ్యూటీ అప్పట్లో సినిమా చేసిందంటే అది బంపర్ హిట్టు అనే నమ్మకం దర్శఖ నిర్మాతల్లో ఉండేది.
సౌత్ లో పెద్దగా సినిమాలు చేయలేదు కానీ.. నార్త్ లో మాత్రం ఈ సీనియర్ హీరోయిన్ హవా ఓ రేంజ్ లో ఉండేది. తెలుగులో ఈ బ్యూటీ నాగార్జున హీరోగా మూడు దశాబ్దాల క్రితం వచ్చిన ‘క్రిమినల్’ సినిమాల్లో నటించింది. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్టయింది. ఆ తర్వాత మణిరత్నం‘బాంబే’లో నటించింది. ఈ సినిమా మాత్రం మనీషాకు సౌత్‌లో తిరుగులేని పాపులారిటీ సంపాదించి పెట్టింది. ఆ తర్వాత వరుసగా శంకర్ దర్శకత్వంలో ‘ఒకే ఒక్కడు’, రజనీకాంత్‌తో ‘బాబా’ వంటి సినిమాల్లో నటించింది. అయితే ఆ తర్వాత మనీషా సౌత్‌లో ఒక్క సారిగా కనిపించడం మానేసింది.
చివరిగా అల వైకుంఠపురం హిందీ రీమేక్ షెహజాదాలో టబు రోల్ ప్లే చేసింది. కాగా, ఈ బ్యూటీ ఒకప్పటి నేపాల్ ప్రధాని మనవరాలు. మనీషా కొయిరాల సినీ జీవితం ముందు నుంచి వివాదాల మధ్య నే నడిచింది. కెరీర్ మొదట్లో ఈ బ్యూటీ పలువురితో డేటింగ్ చేసినట్లు రూమర్లు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఓ స్టార్ హీరోతో పీకల్లోతూ ప్రేమలో పడిందని, కానీ ప్రియుడితో పెళ్లి పీఠలెక్కలేదని వార్తలు కూడా తెగ ఊపేశాయి. ఆ తర్వాత ఈ బ్యూటీ సామ్రాట్ దహాల్ ను పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ల పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు.
పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లి మద్యానికి బానిసైంది. పెళ్లికి ముందే మనీషా కోయిరాలా ఏకంగా 12 మందితో డేటింగ్ చేసిందట. ఆమె డేటింగ్ చేసినవాళ్ల లిస్ట్‌లో నటులు, వ్యాపారవేత్తలు,అంబాసిడర్ కూడా ఉన్నారు. వివేక్ ముశ్రన్, నానా పటేకర్, DJ హుస్సేన్, లండన్‌కు చెందిన నైజీరియన్ వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ, ఆర్యన్ వైద్.. ఇలా 8 మంది పలువురు స్టార్ సెలబ్రెటీలతో ఎఫైర్ నడిపిందని ఇన్ సైడ్ టాక్. ఇక 1989లో వచ్చి ‘ఫేరి బేతావులా’ సినిమాతో తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది నేపాలి బ్యూటీ మనీషా కొయిరాలా.
తొలి సినిమా నేపాలిలోనే చేసింది. ఆ తర్వాత దిలీప్ కుమార్ హీరోగా నటించిన ‘సావుదగర్’ సినిమాతో హిందీ చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపుగా రెండు దశాబ్ధాల పాటు బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. అప్పట్లో చాలా మంది స్టార్ హీరోలు మనీషా డేట్స్ కోసం ఎదురు చూసేవాళ్లంటే ఈ సీనియర్ హీరోయిన్ క్రేజ్ తొలినాళ్లలో ఎలా ఉండేదో ప్రత్యేకించి చెప్పనసవరం లేదు.