భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న 31% మంది పురుషులు మరియు 26% మంది మహిళలు రక్తపోటు కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది. రక్తపోటు నివారణ మరియు నియంత్రణపై మీరు తినే ప్రతిదీ కీలకమైన ప్రభావాన్ని చూపుతుందని, మరియు ఆ సూపర్ఫుడ్లలో నిమ్మకాయ ఒకటి అని నివేదిక పేర్కొంది. మీ రక్తపోటును తగ్గించడానికి ఇది సహాయపడుతుంది ఎందుకంటే ఇది రక్త నాళాలను మృదువుగా చేస్తుంది. అయితే గ్రీన్ టీ, లెమన్ వాటర్ మన గుండె ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. నిమ్మకాయలోని సిట్రస్ కంటెంట్ రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది.
ఇది మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. గ్రీన్ టీ లో పిగల్లోకాటెచిన్ గాలేట్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. బరువు తగ్గే వారు ఒక్క నిమ్మరసాన్నే కాకుండా.. నిమ్మరసంతో కూడిన గ్రీన్ టీని తాగొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి మీ శరీర బరువును, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.
గ్రీన్ టీ లో కూడా కెఫీన్ కంటెంట్ ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే నిమ్మరసంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన మెదడు, నరాల పనితీరును ఉత్తేజపరిచి మిమ్మల్ని చురుగ్గా ఉంచుతుంది. నిమ్మరసంలో హెస్పెరిడిన్ అనే సహజ సమ్మేళనం మెండుగా ఉంటుంది. ఇది మన రక్తంలో చక్కెర స్థాయిలను బాగా తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే ఇది డయాబెటీస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తాగితే మీకు డయాబెటీస్ వచ్చే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది.
మీకు తెలుసా? గ్రీన్ టీ తాగే వారికి చిత్తవైకల్యం వంటి అభిజ్ఞా బలహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని ఒక అధ్యయనం సూచిస్తోంది. నిమ్మరసంలో ఉండే పొటాషియం మీ మెదడుకు రక్త ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది.లెమన్ వాటర్, గ్రీన్ టీ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా చాలా వరకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ గ్రీన్ టీ, లెమన్ వాటర్ క్యాన్సర్ కణాల పెరుగుదలను, వ్యాప్తిని నివారించడానికి బాగా సహాయపడతాయని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి.