15 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులను నెలకొల్పారు లక్ష్మణ్. ప్రపంచ క్రికెట్‌కు మణికట్టు మంత్రజాలాన్ని పరిచయం చేసిన అత్యుత్తమ క్రికెటర్లలో వీవీఎస్ ఒకరు. అతని అప్రయత్న స్ట్రోక్‌ప్లే, మణికట్టు ఫ్లెక్సిబిలిటీ కారణంగా లక్ష్మణ్‌ను ‘‘వెరీ వెరీ స్పెషల్’’ క్రికెటర్‌గా పరిగణిస్తారు నిపుణులు.. చాలామందికి తెలియని ఆసక్తికర విషయం ఏంటంటే.. వీవీఎస్ లక్ష్మణ్.. భారతదేశ రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణ ముని మనవడు. లక్ష్మణ్ తల్లిదండ్రులు విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ శాంతారామ్, డాక్టర్ సత్యభామ. లక్ష్మణ్ హైదరాబాద్‌లోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో చదివాడు. మెడికల్ కోర్సులో చేరి.. చివరకు బ్యాట్ చేతపట్టి క్రికెటర్ అయ్యాడు.
గుంటూరుకు చెందిన జీఆర్ శైలజను 2004లో మ్యారేజ్ చేసుకున్నాడు లక్ష్మణ్. వీరికి కుమారుడు సర్వజిత్, కుమార్తె అచింత్య ఉన్నారు. ఇప్పుడు ఈ లెజెండ్ ప్లేయర్ కూతురుకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింటా వైరల్ గా మారింది. హీరోయిన్స్ ను మించిన అందంతో నెటిజన్స్ మది దోచేస్తుంది. సాధారణంగా సినీ సెలబ్రిటీల పిల్లలకు ఆటో మేటిక్ గా ఫాలోయింగ్ ఉంటుంది. స్టార్ కిడ్స్ పిల్లలను ఇట్టే గుర్తుపట్టేస్తారు. కానీ క్రికెటర్స్ పిల్లలకు అంతలా రికగ్నిషన్ ఉండదనే చెప్పాలి. కానీ, సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.
ఏంజిల్ లుక్ లో సారా మనసులను దోచేస్తూ ఉంటుంది. ఇప్పుడు వీవీఎస్ లక్ష్మణ్ కూతురు అచింత్య అదే రేంజ్ లో ఆకట్టుకుంటోంది. ఇటీవల వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్లారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన తిరుమలను సందర్శించారు. కళియుగ దైవం వేంకటేశ్వర స్వామికి అపర భక్తుడైన లక్ష్మణ్ శ్రీవారికి 15 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఆలయ పుష్పాలంకరణకు ఒక రోజు ఖర్చు 15 లక్షలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుటుంబంతో కలిసి ఫొటోలు దిగారు. ఆ ఫోటోలు కాస్త నెట్టింటా వైరల్ గా మారాయి.
ఆ ఫొటోల్లో లక్ష్మణ్ కూతురు అచింత్య తళుక్కుమని మెరిసింది. మతిపోగొట్టే అందంతో ఉన్న ఆమెను ఆసక్తిగా గమనించారు నెటిజన్స్. హీరోయిన్స్ ను మించిన అందంతో అచింత్య సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అచింత్య ఎంతో పద్దతిగా, సాంప్రదాయ బద్దంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా వీవీఎస్ లక్ష్మణ్ 15 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులను నెలకొల్పారు. లక్ష్మణ్ తల్లిదండ్రులు విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ శాంతారామ్, డాక్టర్ సత్యభామ. లక్ష్మణ్ గుంటూరుకు చెందిన జీఆర్ శైలజను 2004లో మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి కుమారుడు సర్వజిత్, కుమార్తె అచింత్య ఉన్నారు.