దీపావళి పండుగ రోజున చాలా మంది బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు కొంటూ ఉంటారు. ఇలా కొనడం వల్ల వారి అభివృద్ధి పెరుగుతుందని, ఆర్థిక సమస్యలు తీరాతయాని, లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుందని అంటారు. అయితే ధన త్రయోదశి ,నరక చతుర్దశి, దీపావళి… ఈ మూడు పండుగలలో లక్ష్మీ పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీపావళి రోజు సాయంత్రం సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంది.
దీపావళి నాడు లక్ష్మీ దేవిని పూజించడం వలన జీవితంలో డబ్బుకు లోటు ఉండదని విశ్వాసం. లక్ష్మీదేవితో పాటు ఏ దేవతను పూజించాలి..వాస్తవానికి కొన్ని ప్రాంతాల్లో ధనత్రయోదశి రోజున లక్ష్మీ దేవి, కుబేరు దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే దీపావళి లేదా ఇతర రోజులలో కూడా లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని పూజించడం వల్ల డబ్బుకు లోటు ఉండదు. హిందూ మతంలో యక్ష రాజైన కుబేరుడు సంపదకు దేవుడుగా భావిస్తారు. దీపావళి రోజున లక్ష్మీ దేవిని, కుబేర దేవుడిని పూజించడం వలన డబ్బు కొరత తొలగిపోతుంది.
కోరుకున్న అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. డబ్బు సంక్షోభం తొలగిపోతుంది..దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని పూజించడం వల్ల జీవితంలో సంతోషం కలుగుతుందని, ఆర్థిక సంక్షోభం తొలగిపోతుందని మత విశ్వాసం. లక్ష్మీమాత సమేతంగా కుబేర దేవుడిని పూజించే ఇంట్లో ఎప్పుడూ ధనానికి లోటు ఉండదని ఎంతో లాభం ఉంటుందని చెబుతారు. హిందూ మతంలో కుబేరుడి ఆరాధన చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
అంతేకాదు శుక్రవారం రోజున లక్ష్మీ దేవితో పాటు కుబేరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. కుబేరుని పూజించడం వల్ల ఏం జరుగుతుంది.. కుబేరుని పూజించే వ్యక్తికి ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని చెబుతారు. అలాగే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. హిందూ విశ్వాసాల ప్రకారం శుక్రవారం నాడు కుబేరుడిని ఆరాధించడం చాలా ఫలవంతమైనది. ఎందుకంటే ఈ రోజు కుబేరుడితో పాటు లక్ష్మీదేవికి ప్రియమైనది.