మౌని అమావాస్యలో భారీ జనసంద్రం, సెక్టార్-2లో తొక్కిసలాట, తెల్లవారుజాము ఏం జరిగిందంటే..?

divyaamedia@gmail.com
2 Min Read

మామూలుగా రోజుకు కోటిమంది వస్తేనే త్రివేణి సంగమ ప్రాంతం కిటకిటలాడుతూ ఉంటుంది. అలాంటిది ఒక్కరోజే 2కోట్ల 39లక్షలమంది రావడంతో..ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే అన్నిదారులు కిటకిటలాడుతున్నాయి. ఇంత భారీగా భక్తులు క్యూకట్టడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఇక భక్తులు రైల్వేస్టేషన్, బస్టాండ్‌,..ఇలా పలుమార్గాల్లోనుంచి త్రివేణి సంగమం చేరుకోవాలంటే 10నుంచి 12కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి…!

అయితే తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి.. కాగా.. అమృత స్నానం కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.. 40 మందికిపైగా గాయాలైనట్లు అధికారులు తెలిపారు. గాయాలైన వారిని సెక్టార్-2 ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. మాఘమాస మౌని అమావాస్య మహిమాన్వితమైన శుభదినం కావడంతో ఇవాళ పుణ్యస్నానాలకు కోట్లాది మంది వస్తారని అంచనా వేశారు.. దానికి తగినట్లు ఏర్పాటు చేశారు.

అయితే.. తొక్కిసలాట ఘటనతో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమృత స్నానాలు రద్దు చేసుకున్నట్లు అఖండ పరిషత్ కమిటీ ప్రకటించింది.. తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరిస్తుననారు.. లక్షలాది భక్తులతో ప్రయాగ్‌రాజ్ పరిసరాలు నిండిపోయాయి. కాగా, మౌనీ అమావాస్య కావడంతో ఇవాళ తెల్లవారుజామున రెండున్నర తర్వాత నుంచి భక్తుల్ని ఘాట్‌లోకి అనుమతి ఇచ్చారు.

సెక్టార్-2 ప్రాంతంలో ఓచోట బారీకేడ్ తీసినప్పుడు భక్తులు ఒక్కసారిగా మందుకు తోసుకొచ్చారు.. ఆ సమయంలోనే తొక్కిసలాట చోటుచేసుకుందని.. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ఈ విషయం తెలిసిన వెంటనే యూపీ సీఎం యోగితో ప్రధాని మోదీ మాట్లాడారు.. అత్యవసరంగా చేపట్టాల్సిన సహాయ చర్యలపై సమీక్ష చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా.. పకడ్బంధీగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *