పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆ మహిళను బాత్రూంలోకి తీసుకెళ్లి.. రాసలీలలు కానిచ్చేశాడు. అయితే బాధితురాలితో పాటు వచ్చిన మరో మహిళ.. బాత్రూంలో డీఎస్పీ రాసలీలల ఘట్టాన్ని మొత్తం కిటికీలో నుంచి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఆ యువతిని స్టేషన్‌లోని బాత్రూంలోకి తీసుకెళ్లిన డీఎస్పీ రామచంద్రప్ప. ఆ మహిళతో రొమాన్స్ చేశాడు.
యూనిఫాంలో ఉన్న డీఎస్పీ రామచంద్రప్ప, ఆ మహిళకు సంబంధించిన వీడియోను ఆ మహిళతోపాటు వచ్చిన మరో మహిళ.. ఎవరికీ తెలియకుండా కిటికీలో నుంచి వీడియోను రికార్డ్ చేసింది. ఆ మహిళతో బాత్రూంలో డీఎస్పీ జరిపిన రాసలీలలకు సంబంధించిన దృశ్యాలు మొత్తం 35 సెకన్ల పాటు ఆ సెల్‌ఫోన్‌లో రికార్డ్ అయ్యాయి. ఇక ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అది వైరల్ అవుతోంది.
అయితే వారిద్దరి రాసలీలలను వీడియో తీస్తుండటాన్ని ఆ మహిళ చూసి డీఎస్పీకి చెప్పడంతో వారిద్దరూ సర్దుకుని బాత్రూం నుంచి బయటికి వచ్చారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. కర్ణాటక రాష్ట్ర హోంశాఖ మంత్రి జి. పరమేశ్వర స్వస్థలం అయిన తుమకూరు జిల్లా పరిధిలోని మధుగిరి పట్టణం లో ఈ ఘటన జరగడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.
అయితే ఆ వీడియో వైరల్ అయిన తర్వాత నుంచి ఆ డీఎస్పీ రామచంద్రప్ప కనిపించకుండా పోయినట్లు సమాచారం. అయితే ఈ పరిణామంపై పోలీసు శాఖ ఇంకా అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. ఇక ఆ డీఎస్పీపై సదరు మహిళ ఫిర్యాదు చేసిందో లేదో ఇంకా తెలియరాలేదు. ఈ కేసులో ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.
WATCH | A woman went to Madhugiri DYSP Ramachandrappa's office in Pavagada, #Karnataka, to file a land dispute complaint.
— Ashwini Shrivastava (@AshwiniSahaya) January 3, 2025
Allegedly, the DYSP took her to his restroom & sexually assaulted her, claiming to help with the dispute. A video of the incident was recorded.
This issue… pic.twitter.com/tfEm3qRK15