బ్యూటీఫుల్ హీరోయిన్ కృతి సనన్ ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కానీ ఫస్ట్ సినిమా అనుకున్నంత ఫలితం రాకపోవడంతో ఈ భామను అంత క్రేజ్ రాలేదు. తర్వాత ‘దోచెయ్’ మూవీలో నటించగా అది కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయితే ముంబాయిలోని సెలూన్ నుఉంచి బయటకు వస్తూ కెమెరాలకు చిక్కింది కృతిసనన్. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అభిమానులను కట్టిపడేస్తున్నాయి. అయితే ఇందులో కృతి పెద్దగా మేకప్ లేనట్టుగా కనిపించింది. సహజమైన లుక్‌లో దర్శనమిచ్చి మంత్రముగ్దుల్ని చేసింది. మేకప్ లేకుండా ఇలా కృతి లుక్ బాగా ఆకట్టుకుంటుంది. మేకప్ లేకుండా కూడా కృతి ఇంత అందంగా కనిపించడం పట్ల వారంతా సంతోషంవ్యక్తం చేస్తున్నారు, కృతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కృతి ప్రస్తుతం కబీర్ బహియాతో డేటింగ్ చేస్తున్నారు.
కబీర్ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుల్జిందర్ బహియా కుమారుడు కబీర్. వారిద్దరి మధ్య 9 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. తాజాగా ఈ ఇద్దరు ముంబాయిలోని ప్రైవేట్ ఎయిర్ పోర్ట్ లో మెరిశారు. ఎక్కడికో వెళ్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. కృతి సనన్ తెలుగులో వన్‌ః నేనొక్కడినే
సినిమాలో మహేష్ బాబుతో కలిసి నటించిన విషయం తెలిసిందే.
హీరోయిన్‌గా ఆమెకిది తొలి చిత్రం. ఇది పెద్దగా ఆడలేదు. దీంతో బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యింది. మధ్యలో నాగచైతన్యకి జోడీగా దోచెయ్
మూవీలో నటించింది. అది కూడా ఆడలేదు. రెండేళ్ల క్రితం ప్రభాస్‌తో ఆదిపురుష్
చిత్రంలో నటించింది. ఈ మూవీ కూడా డిజప్పాయింట్ చేసింది. దీంతో ఇప్పుడు బాలీవుడ్‌కే పరిమిమయ్యింది కృతి.