కీర్తి సురేశ్, ఆంటోనీ ఒక్కటయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. కీర్తి, ఆంటోనీ తెల్లని దుస్తుల్లో మెరిసిపోయారు. ఇరు కుటుంబాలకు చెందినవారు, బంధుమిత్రుల కోలాహలం నడుమ వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే ఇప్పటికీ కీర్తి సురేశ్ పెళ్లి ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇప్పటికీ కీర్తి సురేశ్ పెళ్లి ఫొటోలు ట్రెండింగ్ లో ఉండడం విశేషం. తాజాగా కీర్తి సురేష్ తో కలిసి మళ్లీ క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లిపీటలెక్కినట్లు తెలుస్తోంది. ఆంటోని తట్టిల్ తో కలిసి కిస్ చేసుకోవడం, ఇద్దరూ రింగ్స్ మార్చుకోవడం, డ్యాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మరోసారి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా కీర్తి సురేశ్ – ఆంథోనీలు దాదాపు 15 ఏళ్ల నుంచి స్నేహితులు. ఈ విషయాన్ని కీర్తి సురేశ్ నే సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దీపావళి వేడుకల్లో భాగంగా భర్తతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేస్తూ దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని క్యాప్షన్ ఇచ్చింది. అంటే స్కూల్ డేస్ నుంచి ఇద్దరికీ పరిచయం ఉంది. కాలేజీ రోజుల్లో ఆ పరిచయం ప్రేమగా మారిందిని తెలుస్తోంది. ఇక ఆంటోనీది వ్యాపార కుటుంబం. కొచ్చి, చెన్నైలలో అతనికి వ్యాపారాలున్నాయి.
#ForTheLoveOfNyke 🤍 pic.twitter.com/DWOoqarM43
— Keerthy Suresh (@KeerthyOfficial) December 15, 2024