Janmashtami: కృష్ణాష్టమి సందర్భంగా ఈ వస్తువులను దానం చేస్తే.. అదృష్టం మీ తలుపు తడుతుంది.
Janmashtami: ఈ రోజున శ్రీ కృష్ణుడు కంస కారాగారంలో అర్ధరాత్రి జన్మించాడు. అదే రోజు రాత్రి శ్రీ కృష్ణుడి తండ్రి వాసుదేవ్ అతన్ని గోకుల్‌లో విడిచిపెట్టాడు. అందుకే జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని బాల రూపాన్ని పూజించడంతో పాటు ఉపవాసం కూడా పాటిస్తారు. ఈ రోజున శ్రీ కృష్ణుని బాల రూపాన్ని అంటే లడ్డూ గోపాలుడిని పూజించడం ద్వారా జీవితంలోని దుఃఖాల నుండి విముక్తి లభిస్తుందని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అయితే ప్రతి సంవత్సరం, భాద్ర మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథిని శ్రీకృష్ణుని జన్మదినంగా జరుపుకుంటారు.
Also Read: చర్మ వ్యాధులను మాయం చేసే బావి. ఈ నీళ్లు అమృతంతో సమానం..!
మత విశ్వాసాలు, పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ఈ రోజున జన్మించాడని నమ్ముతారు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు. కానీ మీకు తెలుసా కృష్ణ జన్మాష్టమి రోజుకు ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎంతగా అంటే ఈ పనులు చేస్తే అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది. ప్రముఖ జ్యోతిష్యుడు, వాస్తు సలహాదారు పండిట్ హితేంద్ర కుమార్ శర్మ చెబుతున్నది ఏమిటంటే జన్మాష్టమి రోజున కొన్ని వస్తువులను దానం చేయడం శుభప్రదమని సెలవిచ్చారు. దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని అందరికీ తెలుసు. కానీ అన్నదానం చేయడం వల్ల తరగని ఫలితాలు ఉంటాయి.
ఎందుకంటే ఆహారాన్ని దానం చేయడం గొప్ప బహుమతిగా పరిగణించబడుతుంది. ప్రతి మనిషి బతకడానికి తిండి, బట్ట కావాలని దేవుణ్ణి వేడుకుంటాడు. మీరు ఎవరికైనా దానం చేయడానికి ఈ దుస్తులను ఎంచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుంది. పేదరికం కూడా దూరం అవుతుంది. శ్రీకృష్ణుడికి వెన్న అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. జ్యోతిషశాస్త్రంలో ఇది శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది.
Also Read: ఈ ఒక్క 1 రూపాయి నోటు మీ దగ్గర ఉంటే చాలు. మీరు కోట్లు సంపాదించవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో జన్మాష్టమి నాడు వెన్న దానం చేయడం వల్ల శుక్ర దోషాల నుంచి బయటపడవచ్చు. శ్రీకృష్ణుని తలపై ఉన్న నెమలి ఈకను మీరు తప్పక చూసి ఉంటారు. జన్మాష్టమి నాడు నెమలి ఈకలను దానం చేయడం వలన మీ అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తవుతాయని మరియు శ్రీకృష్ణుడి దయతో మీ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.