‘ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన వేగంగా కోలుకుంటున్నారు. సైఫ్ మెళ్లిగా నడుస్తున్నారు. భయపడాల్సిందేమీ పనిలేదు. పెరాలసిస్ రిస్క్ కూడా లేదు. ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్‌కు షిఫ్ట్ చేశాం. అయితే వారం వరకు ఆయన్ను విజిటర్స్ కలవడానికి లేదు. వెన్ను గాయం కారణంగా ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
అయితే తెల్లవారుజామున 2 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేశాడు. ఆయనను లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. భర్త సైఫ్‌ను చూసేందుకు కరీనా ఆసుపత్రికి వెళ్లారు. కరీనా కపూర్ గురువారం లీలావతి ఆసుపత్రిలో తన భర్త సైఫ్ అలీ ఖాన్‌ను సందర్శించారు. ఆమె మెరూన్ షర్ట్, జీన్స్ ధరించి ఉన్నారు. భర్త సైఫ్ అలీ ఖాన్‌ను చూసిన తర్వాత కరీనా కపూర్ ఆసుపత్రి నుంచి బయలుదేరుతున్న దృశ్యం. సైఫ్ కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉంటారు.
తండ్రి సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరగడంతో సారా, ఇబ్రహీం ఆందోళన చెందారు. ఇద్దరూ తండ్రిని చూసేందుకు ఆసుపత్రికి వెళ్లారు. సైఫ్ అలీ ఖాన్‌ను చూసేందుకు కరిష్మా కపూర్ కూడా ఆసుపత్రికి వెళ్లారు. ఆమెను ఆసుపత్రి బయట చూశారు.కరీనా కపూర్ కి కరిష్మా సోదరి అనే సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ సోదరి సోహా అలీ ఖాన్ కూడా తన సోదరుడిని చూసేందుకు లీలావతి ఆసుపత్రికి వెళ్లారు.
#WATCH | Saif Ali Khan Attack Case | Dr Nitin Dange, Chief Neurosurgeon Lilavati Hospital Mumbai says, "Saif Ali Khan is better now. We made him walk, and he walked well…Looking at his parameters, his wounds and all the other injuries, he is safe to be shifted out of the… pic.twitter.com/VR5huOrSQ2
— ANI (@ANI) January 17, 2025