HYDRA: హైడ్రా చట్టం పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏ.వీ రంగనాథ్. ఒత్తిళ్లకు తలొగ్గకుండా..!

divyaamedia@gmail.com
2 Min Read

HYDRA: హైడ్రా చట్టం పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏ.వీ రంగనాథ్. ఒత్తిళ్లకు తలొగ్గకుండా..!

HYDRA: హైడ్రా చట్టం అమల్లోకి వచ్చిన తర్వత నేరగుా హైడ్రా పేరిట నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. చెరువులను, నాలాలను, కుంటలను ఆక్రమించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని రంగనాధ్ తెలిపారు. అది పార్టీలకు అతీతంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోని ఆక్రమణలకు గురైన భూములను కాపాడేందుకు “హైడ్రా” తీవ్రంగా కృషి చేస్తోంది.

Also Read: హైదరాబాద్ పై విరుచుకుపడుతున్న వరుణుడు, మూడు రోజుల పాటు వానలే వానలు.

ఆకాశమంత ఎత్తైన భవనాలను సైతం బుల్ డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. హైడ్రా ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏజెన్సీగా ఏర్పాటు చేసింది. రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమిస్తూ రేవంత్ సర్కార్ ఈ హైడ్రామాకు ప్రత్యేక అధికారాలు కూడా ఇచ్చింది. అయితే.. ఈ క్రమంలో ‘హైడ్రా’ కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

త్వరలో హైడ్రా పేరుతో ప్రత్యేక చట్టం చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి విధివిధానాలు, నిబంధనలను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే హైడ్రామా పేరుతో నిర్వాసితులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. హైడ్రా కార్యకలాపాల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లను అందుబాటులో ఉంచుతామని, ఇక్కడ ప్రజలు నేరుగా ఫిర్యాదులు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.

Also Read: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం, భయాందోళనలో శివయ్య భక్తులు.

అక్రమ నిర్మాణాలకు సహకరించిన ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. మరోవైపు బీఆరెఎస్ ఎమ్మేల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు ఇవాళ హైడ్రా నోటీసులు ఇచ్చింది. దుండిగల్ లోని ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. చిన్న దామెర చెరువు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించారని నోటీసుల్లో పేర్కొంది.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *