కష్టం ఎంతటిదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవడమే మనిషి యొక్క లక్షణం అని కూడా కామెంట్లు చేస్తున్నారు. అన్నీ తెలిసినా సరే చాలామంది సెలబ్రిటీలు తమ కొచ్చిన కష్టాన్ని భరించలేక లేదా ఎదుర్కోవడంలో విఫలం అయ్యి ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ శంకర్ తిరువనంతపురంలోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించాడు. ఇది మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది.
ఓ మంచి నటుడు ఇకలేరన్న వార్త తెలిసి పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. దిలీప్ శంకర్ స్వస్థలం ఎర్నాకులం. అతను అనేక పాపులర్ మలయాళ సీరియల్స్‌లో నటించాడు. ‘అమ్మ తాతో’, ‘పంజాగ్ని’, ‘సుందరి’ వంటి సీరియల్స్‌తో పాటు కొన్ని సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటించారు. కాగా, ‘పంజాగ్ని’ సీరియల్ షూటింగ్ కోసం దిలీప్ శంకర్ ఎర్నాకులం నుంచి తిరువనంతపురం వెళ్లాడు. రెండు రోజుల పాటు షూటింగ్ నిలిపివేయడంతో అక్కడే ఓ హోటల్‌లో బస చేశారు.
హోటల్ రూమ్ బుక్ చేసుకున్న తర్వాత షూటింగ్ టీమ్ గత రెండు రోజులుగా అతడిని సంప్రదిస్తోంది. అయితే ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెబుతున్నారు. హోటల్‌లో విచారణ చేయగా అతను రెండు రోజులుగా గది నుండి బయటకు రాలేదని తేలింది. అనంతరం హోటల్ గదిలో శవమై కనిపించాడు. నటుడు దిలీప్ శంకర్‌కు శారీరకంగా ఇబ్బందులు ఉన్నాయని చిత్రబృందం పోలీసులకు సమాచారం అందించింది.
ఆయన కూడా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. పోలీసులు అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి అసహజ కారణాలు లేవని ప్రాథమిక విచారణలో తేలింది. పోస్టుమార్టం అనంతరం ఫలితాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.