తమిళనాడు కు చెందిన ఆ హీరోయిన్ ఎయిడ్స్ వ్యాధి సోకి 2007 లో కన్ను మూసింది. 80వ దశాబ్ధంలో ఒక ప్రొడ్యూసర్ మోసం చేయడంతో ఆమె జీవితం దుర్భరంగా మారిందనే వార్తలు అప్పట్లో వినిపించాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో జీవితం అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు, అందులో చాలా స్ట్రగుల్ కూడా ఉంటుంది. ఎత్తుపల్లాలు ఎన్నో చవిచూడవల్సి ఉంటుంది. వాటన్నింటినీ అదిగమిస్తేనే ఈ రంగుల ప్రపంచంలో భవిష్యత్తు ఉంటుంది.
ఓ స్టార్ హీరోయిన్ తెలిసీతెలియని తనంతో జీవితంలో తప్పటడుగు వేసి అత్యంత దీనస్థితిలో తన జీవితానికి ముగింపు పలికింది. ఆమే నిషా నూర్. నిషా నూర్.. 1980లలో చాలా పాపులర్ హీరోయిన్. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో ఆమె నటించింది. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్‌లతో కలిసి నటించింది నిషా నూర్. గ్లామర్, బోల్డ్ పాత్రలకు ప్రసిద్ది చెందిన ఆమెకు అభిమానులు అప్పట్లో ఎక్కువే. అప్పట్లో దక్షిణాదికి చెందిన ప్రతి దర్శకుడూ నిషాతో సినిమా తీయాలని భావించేవాడని అంటుండేవారు.
ఈమె నటించిన అనేక తమిళ, మలయాళం సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి. 1995 తర్వాత నిషా నూర్‌కు అవకాశాలు తగ్గాయి. ఆమె సంపాదనంతా క్షణాల్లో ఆవిరైంది. కష్ట సమయాల్లో ఆమెకు కుటుంబం లేదా స్నేహితుల నుండి ఎటువంటి మద్దతు లభించలేదు. స్టార్‌డమ్ స్టేటస్‌ను అనుభవించిన ఆమె అవకాశాల్లేక బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దిగినట్లు సమాచారం. ఓ బడా నిర్మాత బలవంతం వల్లే ఈ రొంపిలోకి దిగిందని అప్పట్లో బాగానే ప్రచారం సాగింది.
చాలా ఏళ్ల తర్వాత నిషా నూర్ ఎట్టకేలకు ఓ దర్గా బయట వీధుల్లో నిద్రిస్తూ కనిపించింది. నిషా నూర్‌ను తమిళ NGO ముస్లిం మున్నేట్ర కజగం రక్షించినప్పుడు, ఆమె చాలా బలహీనంగా ఉండింది. బక్కచిక్కి గుర్తుపట్టలేని స్థితికి మారిపోయింది. హాస్పిటల్ లో టెస్టులు చేయించగా నిషా నూర్ ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. నిషా నూర్.. 2007లో 44 ఏళ్ల వయస్సులో హాస్పిటల్ లో ఎయిడ్స్ తో పోరాడుతూ మరణించింది.