Hindenburg: హిండెన్ బర్గ్ రీసెర్చ్ వెనుక ఎవరు ఉన్నారు.
Hindenburg: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన తీవ్ర ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా అదానీ ఆఫ్‌షోర్ ఫండ్స్‌లో సెబీ చైర్‌పర్సన్ మధాబి పూరీ బుచ్ వాటాలు ఉన్నాయని ఆరోపణలతో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ శనివారం విడుదల చేసిన రిపోర్టు సంచలనంగా మారింది. అయితే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనేది న్యూయార్క్ ఆధారిత పెట్టుబడి సంస్థ, దీనిని ‘షార్ట్ సెల్లర్’గా పిలుస్తారు. ఇది మార్కెట్లోని అవకతవలను గుర్తించి బయటపెడుతుంది. తద్వారా షార్ట్ సెల్లింగ్ చేసే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కంపెనీని నాథన్ ఆండర్సన్ అనే వ్యక్తి స్థాపించారు.
Also Read : మీ ఎటిఎం లేదా క్రెడిట్ కార్డ్ పోయిందా..? వెంటనే ఈ పని చేయండి.
ఇది ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ, కార్పొరేట్ మోసాలు వెలికితీయడంలో దీని ప్రత్యేకత అని చెప్పవచ్చు. 2017లో స్థాపించినన, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ప్రపంచ వ్యాప్తంగా పలు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన కంపెనీలు పాల్పడిన అవకతవకలను బయటపెట్టింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి సలహాలను అందించడానికి తాము వినూత్న విశ్లేషణ పద్ధతులను ఉపయోగిస్తామని హిండెన్ బర్గ్ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా కంపెనీలలో జరిగే అకౌంటింగ్ మోసాలు, సర్వీస్ ప్రొవైడర్ అక్రమాలు, చట్టవిరుద్ధమైన, అనైతిక వ్యాపార కార్యకలాపాలను బయటపెట్టడమే తమ లక్ష్యమని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తెలిపింది.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెబ్‌సైట్ ప్రకారం, సంస్థ అనేక కార్పోరేట్ కంపెనీలపై పరిశోధనలు నిర్వహించింది. ఇలాంటి అనేక నివేదికలను తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది, అందులో ప్రముఖ పేరు నాన్‌బన్ వెంచర్స్. ఇది ఒక ప్రైవేట్ పెట్టుబడి సంస్థ. ఈ కంపెనీలో జరిగిన అక్రమాలను బయటపెట్టింది. అలాగే అమెరికాకు చెందిన నికోలా కార్పొరేషన్, క్లోవర్ హెల్త్ మంచి కంపెనీలో జరిగిన మోసాలను కూడా బయట పెట్టడంతో ఇన్వెస్టర్లను అలెర్ట్ చేసింది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ ద్వారా మార్కెట్లో షార్ట్ సెల్లింగ్ ప్రోత్సహిస్తుంది, ఇప్పుడు షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం.
Also Read : యూపీఐ ద్వారా డబ్బులు పంపేవారికి మంచి వార్త చెప్పిన RBI.
షార్ట్ సెల్లింగ్ అనేది మార్కెట్ వ్యూహం. దీని కింద ట్రేడర్లు పెరుగుతున్న ఎంపిక చేసుకున్న స్టాక్ వ్యతిరేకంగా పందెం కాస్తారు. ఇది లాంగ్ పొజిషన్‌కు వ్యతిరేకం అని చెప్పవచ్చు. షార్ట్ సెల్లర్ ముందుగా తన వద్ద షేర్లు లేకపోయినప్పటికీ కంపెనీ షేర్లను పెద్ద మొత్తంలో విక్రయిస్తాడు. ఇందుకోసం సెక్యూరిటీ మార్కెట్లు మీకు షేర్లను అప్పుగా ఇస్తాయి. మీరు ఎంపిక చేసుకున్న స్టాక్స్ భారీ మొత్తంలో పతనం అయిన తర్వాత. తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు.అప్పుగా తీసుకున్న షేర్లను బ్రోకర్లకు ఇచ్చేసి లాభం పొందుతారు.