Heart : గుండెపోటు, గుండెల్లో మంటకు తేడా ఇదే, పొరపాటున ఆ తప్పు చేసారో..?

divyaamedia@gmail.com
4 Min Read

Heart : గుండెపోటు, గుండెల్లో మంటకు తేడా ఇదే, పొరపాటున ఆ తప్పు చేసారో..?

Heart : గుండె సమస్యలు మనిషి జీవిత ఆయుష్షును తగ్గిస్తాయి. వయసుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు వచ్చి పడుతున్నాయి. గుండె ఆరోగ్యం క్షీణించేలా మీకు తెలియకుండానే రోజూ కొన్ని పనులు చేస్తున్నారు. మీరు తినే దగ్గర నుంచి నిద్రపోయే విధానం వరకు ప్రతి చిన్న పని గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మీరు చేస్తున్న కొన్ని పనులను మాని గుండెను కాపాడుకోండి. అయితే మనకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే, సాధారణంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే చాలా మంది అనారోగ్య లక్షణాలను పట్టించుకోరు. కొందరు మాత్రం చిన్న సమస్యలను పెద్ద వ్యాధులుగా భావించి ఆందోళన పడుతుంటారు. ఆందోళన పడినా ఫరవాలేదు గానీ, అశ్రద్ధ చేస్తే మాత్రం ప్రాణాలకే ముప్పు వస్తుంది. ముఖ్యంగా చాలా మంది గుండె నొప్పి, గుండెల్లో మంటకు తేడాలు గుర్తించలేరు. కొందరికి ఛాతీ నొప్పి భయంకరంగా ఉంటుంది.

Also Read: ఇలాంటి వారు తేనె తినకపోవడమే మంచిది, పొరపాటున తిన్నారో..?

అయితే ఇది గుండెల్లో మంట, గుండెపోటు రెండింటికి సంకేతం కావచ్చు. ఈ రెండు సందర్భాల్లోనూ గందరగోళానికి గురవుతారు. ఎందుకంటే రెండు సమస్యలు ఛాతీ ప్రాంతంలోనే అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అందుకే వీటి మధ్య తేడాలు తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే గుండెపోటు అయితే అత్యవసర వైద్య సహాయం అవసరం. గుండెల్లో మంట అంటే ఏంటి..? గుండెల్లో మంట అనేది బ్రెస్ట్‌ బోన్‌(రొమ్ము ఎముక వెనుక), ఛాతీ మధ్యలో సంభవించే మంట. ఇది సాధారణంగా యాసిడ్ రిఫ్లక్స్ వల్ల వస్తుంది. స్టమక్‌ యాసిడ్‌ తిరిగి గొంతులోకి (ఎసోఫేగస్) వచ్చినప్పుడు గుండె వద్ద మంటగా అనిపిస్తుంది. గుండెల్లో మంట సాధారణంగా భోజనం చేసిన తర్వాత వస్తుంటుంది. పడుకున్నప్పుడు ఇంకొంచెం తీవ్రంగా ఉంటుంది.

గుండెల్లో మంట ఉన్న వ్యక్తుల నోరు పుల్లగా అనిపిస్తుంది. అధిక లాలాజలం వస్తుంది, కొన్నిసార్లు ఆహారం గొంతు వెనుక భాగంలోకి తిరిగి వస్తుంది. గుండెపోటు.. గుండెకు రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడటం వల్ల గుండె కండరాలకు నష్టం జరిగినప్పుడు గుండెపోటు వస్తుంది. ఈ అడ్డంకి సాధారణంగా కరోనరీ ధమనుల్లో కొవ్వు నిల్వలు పేరుకుపోవడం వల్ల వస్తుంది, ఇది తీవ్రమైన ఛాతీ నొప్పికి (ఆంజినా) దారి తీస్తుంది. గుండెపోటు నొప్పి సాధారణంగా గుండెల్లో మంట కంటే తీవ్రంగా ఉంటుంది. తరచుగా చెమట, వాంతులు, మెడ, భుజాలు లేదా చేతులకు నొప్పి వ్యాపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రకమైన నొప్పి సాధారణంగా శారీరక శ్రమతో తీవ్రమవుతుంది. విశ్రాంతి తీసుకోవడంతో తీవ్రత తగ్గుతుంది. తేడా ఎలా గుర్తించాలి..? టైమింగ్, ట్రిగ్గర్స్: గుండెల్లో మంట తరచుగా భోజనం చేసిన తర్వాత వస్తుంటుంది.

Also Read: ఈ లడ్డూలు తరచూ తింటుంటే చాలు, మీ జుట్టు రాలడం ఆగిపోవాల్సిందే..!

కొన్ని రకాల ఆహార పదార్థాలు తిన్నప్పుడు, తిన్న వెంటనే పడుకున్నప్పుడు సమస్య తీవ్రంగా ఉంటుంది. గుండెపోటు నొప్పి ఎప్పుడైనా సంభవించవచ్చు. ముఖ్యంగా శారీరక శ్రమ లేదా ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయంలో సంభవిస్తుంది. అందుకే మరీ వేడి నీరు కాకుండా మరీ చల్లటి నీరు కాకుండా స్నానం చేయాలి. అలాగే తలపై ఒకేసారి నీరు పోయకుండా క్రమంగా పోస్తుండాలి. గతంలో గుండెపోటు వచ్చిన వారు, బీపీ పేషెంట్స్‌, వృద్ధులు బాత్‌రూమ్‌ ఉపయోగించే సమయంలో డోర్‌ మూయకుండా ఉండడమే ఉత్తమం అని చెబుతున్నారు. నొప్పి స్వభావం: గుండెల్లో మంట ఛాతీలో మంటగా అనిపిస్తుంది. గుండెపోటు నొప్పి సాధారణంగా మరింత తీవ్రంగా ఉంటుంది. ఛాతీపై ఒత్తిడి పెరుగుతుంది, భారంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

Also Read: నిద్రపోయే ముందు పాదాలకు మసాజ్ చేయడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..?

ఉపశమనం: యాంటాసిడ్‌లతో లేదా లేచి కూర్చోవడం ద్వారా గుండెల్లో మంట సమస్య తగ్గుతుంది. గుండెపోటు నొప్పి ఈ చర్యలతో కుదుటపడదు. విశ్రాంతి లేదా మందులతో మాత్రమే ఉపశమనం పొందవచ్చు. ఎప్పుడు అప్రమత్తం అవ్వాలి..? మీ ఛాతీ నొప్పి గుండెల్లో మంట లేదా గుండెపోటు అని మీకు కచ్చితంగా తెలియకుంటే, జాగ్రత్తగా ఉండటం, వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. చాలా మంది గుండెపోటు లక్షణాలను కొన్నిసార్లు గుండెల్లో మంటగా భావిస్తుంటారు. ఇది తీవ్ర ప్రమాదాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా వృద్ధులు లేదా ధూమపానం, మధుమేహం లేదా అధిక రక్తపోటు ఉన్నవారు అశ్రద్ధ చేస్తే ప్రాణాలకు ముప్పు సంభవిస్తుంది.

Also Read: ఈ చిట్కాలు పాటిస్తే మీరు నిద్రలోనే మీ అందాన్ని పెంచుకోవచ్చు.

వృద్ధుల్లో తరచుగా గుండెల్లో మంట రావడం కొన్నిసార్లు అంతర్లీన గుండె సమస్యలకు సంబంధించినది కావచ్చు. యాసిడ్ రిఫ్లక్స్ నివారించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు పాటించాలి. పోషకాహారం తినడం, ఆయిల్ ఫుడ్ తగ్గించడం, ఆల్కహాల్, కెఫిన్‌లను పరిమితం చేయడం అవసరం. హెల్తీ వెయిట్‌ మెయింటైన్‌ చేయడం కూడా చాలా అవసరం.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *