కెప్టెన్‌గా రోహిత్ శర్మ వారసుడు అతడేనని అంతా ఫిక్సైన తరుణంలో.. సూర్యకుమార్‌ను టీ20 సారథిగా, శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసి బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి హార్దిక్‌ను ఎందుకు పక్కకు తప్పించారనేది హాట్ టాపిక్‌గా మారింది. అయితే నిన్నటి ట్రైనింగ్ సెషన్‌లో హార్దిక్ చాలాసేపు కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో మాట్లాడాడు. తర్వాత ఇద్దరు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌కు బౌలింగ్ చేశాడు. అనంతరం కొత్త అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ పర్యవేక్షణలో హార్దిక్ బ్యాటింగ్ చేశాడు. అయితే సిములేషన్ సెషన్ సందర్భంగా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
సిమ్యులేషన్ ప్రాక్టీస్‌లో బంతిని ఏ రీజియన్‌లో కొడితే బౌండరీకి వెళ్తుందో ఊహించి నెట్ సెషన్‌లో బ్యాటింగ్ చేస్తారు. అయితే హార్దిక్ పాయింట్ రీజియన్‌లో షాట్ కొట్టి, అది బౌండరీ అని చెప్పాడు. కానీ అభిషేక్ నాయర్ ఇందుకు అంగీకరించలేదు. తాను అక్కడ ఫీల్డర్‌ను పెట్టేవాడినని చెప్పాడు. అయితే ఫీల్డర్‌ను ఉంచే కచ్చితమైన ప్లేస్‌మెంట్ ఎక్కడ అని హార్దిక్ నాయర్‌ను అడిగాడు. దీంతో అసిస్టెంట్ కోచ్ ఎరుపు రంగు టీ షర్ట్ వేసుకున్న ఒక రిపోర్టర్ వైపు చూపాడు. ఆ రెవ్‌స్పోర్ట్జ్ జర్నలిస్ట్, ట్రైనింగ్ సెషన్‌ను గమనిస్తున్నాడు. అయితే బాల్‌ను ఈ యాంగిల్‌లో కొడితే, అక్కడ ఫీల్డర్ ఉన్నా అది బౌండరీకి వెళ్లి ఉండేదని హార్దిక్ వాదించాడు.
దీంతో క్లారిఫికేషన్ కోసం ఇద్దరూ ఆ జర్నలిస్ట్ దగ్గరికి వెళ్లారు. పాండ్యా ఆడిన ఆ షాట్ బౌండరీకి వెళ్తుందా అని నాయర్ రిపోర్టర్‌ను అడిగాడు. దీనికి అతడు సమాధానం ఇస్తూ.. ‘మీ ఫీల్డర్‌ను ఇక్కడ ఉంచితే, బాల్ బౌండరీకి వెళ్లేది’ అని చెప్పాడు. ఈ రిప్లై తర్వాత హార్దిక్, నాయర్ ఇద్దరూ నవ్వుకున్నారు. ఇది ఇద్దరి మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్. గేమ్ సిములేషన్‌లో నేనే గెలిచానని అసిస్టెంట్ కోచ్‌కు చెప్పిన హార్దిక్, తర్వాత ప్రాక్టీస్ కంటిన్యూ చేశాడు. ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత కూడా ఈ ఇద్దరూ రిపోర్టర్‌తో కాసేపు మాట్లాడారు.
ముందు అతడు క్రికెట్ ఫ్యాన్ అనుకున్నారు, కానీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అని ఆ తర్వాత తెలిసింది. ఈ సిరీస్‌కు ముందు వరకు ఎక్కువగా వార్తల్లో నిలిచిన ప్లేయర్ హార్దిక్ పాండ్యా. టీ20 వరల్డ్ కప్ వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, శ్రీలంక టీ20 సిరీస్‌కు అతన్ని కాదని సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు. తర్వాత పాండ్యా, తన భార్య నటాసా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు శ్రీలంక టీ20 సిరీస్ ఆడుతున్నాడు. అయితే ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు.