ఏదో రెండు దేశల క్రికెట్ టీమ్‌లు ఆడుతున్నట్లు అస్సలు చూడరు. చెప్పాలంటే.. క్రికెట్ మ్యాచ్‌ను ఒక యుద్ధంలా చూస్తారు. ఇందుకు ఇరు దేశాల మధ్య చారిత్రక నేపథ్యమూ లేకపోలేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది. ఈ టోర్నమెంట్‌లోని మ్యాచ్‌లు లాహోర్, కరాచీ, రావల్పిండిలలో జరుగుతాయి. అదే సమయంలో టీం ఇండియా మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగుతున్నాయి. ఈ మినీ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే దుబాయ్ నుంచి ఒక వీడియో బయటకు వచ్చింది.
ఈ వైరల్ వీడియోలో, టీమిండియా, పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, షోయబ్ అక్తర్ పరస్పరం గొడవకు దిగారు. వీరిద్దరూ ఒకరినొకరు నెట్టుకుంటూ బాహబాహికి దిగారు. అయితే ఇది సీరియస్ గా కాదు. కేవలం సరదా కోసమే. ఇంటర్నేషనల్ లీగ్ టి-20 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా దుబాయ్ స్టేడియంలో వీరిద్దరూ ఇలా సరదాగా గడిపారు. హర్భజన్ సింగ్, షోయబ్ అక్తర్ ఇద్దరూ కొన్ని సంవత్సరాల క్రితం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు.
మైదానంలో ఉన్నంతవరకు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూసే హర్భజన్, అక్తర్ బయట మాత్రం మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకరినొకరు ఎగతాళి చేసుకుంటారు. ఇప్పుడు దుబాయ్‌లో ఈ ఇద్దరి మధ్య ఇలాంటిదే జరిగింది. ILT20 ఫైనల్ కోసం హర్భజన్, అక్తర్ ఇద్దరూ దుబాయ్‌లో ఉన్నారు. వైరల్ వీడియోలో, వారిద్దరూ ఒకరినొకరు సవాలు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. భజ్జీ చేతిలో బ్యాట్ పట్టుకుని, అక్తర్ బంతి పట్టుకుని కనిపించారు. ఇద్దరూ ఒకరి వైపు ఒకరు దూసుకొచ్చారు.
ఆ తర్వాత అక్తర్ భజ్జీని తోస్తాడు. ఆ తర్వాత, భజ్జీ అక్తర్‌కి సైగ చేసి బౌలింగ్ చేయమని అడుగడం ఈ వీడియో చూడవచ్చు. ‘ఛాంపియన్ ట్రోఫీ 2025 కోసం మేము ఇలా సిద్ధం అవుతున్నాం” అని ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చాడు అక్తర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై క్రికెట్ అభిమానులు, నెటిజెన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Thats our way of getting ready for Champions Trophy. @harbhajan_singh kee kehnday oh? pic.twitter.com/ZufYlOt7Y4
— Shoaib Akhtar (@shoaib100mph) February 9, 2025