గ్రే డివోర్స్.. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్లో ఎక్కువగా వినిపిస్తున్న పదం. గ్రే డివోర్స్ అంటే.. జుట్టు నెరుస్తున్న సమయంలో విడాకులు తీసుకోవడం అన్నమాట. అంటే.. భార్యాభర్తలుగా 25 నుండి 30 ఏళ్ల పాటు జీవించి ఆ తర్వాత విడాకులు తీసుకోవడం అన్నమాట. అయితే డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్, టీమిండియా మాజీ ప్లేయర్ వీరేందర్ సెహ్వాగ్ డివోర్స్ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సెహ్వాగ్, ఆయన సతీమణి ఆర్తి విడిపోతున్నారంటూ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 46 ఏళ్ల సెహ్వాగ్ తన దూర బంధువు అయిన ఆర్తితో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు మిడిల్ ఏజ్‌లో ఈ ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపత్యంలో సెహ్వాగ్, ఆర్తి మధ్య గ్రే డివోర్స్ (పురాణ వయస్సులో విడాకులు) జరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇలాంటి డివోర్స్ ఇప్పటికే కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్, అతని మొదటి భార్య సారికా ఠాకూర్.. అలాగే బాలీవుడ్ నటీ మాలైకా అరోరా, అర్బాజ్ ఖాన్ తీసుకున్నారు. సెహ్వాగ్-ఆర్తి కూడా అదే మార్గంలో విడిపోతారని చర్చలు జరుగుతున్నాయి. వీరేందర్ సెహ్వాగ్ 2004లో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఆర్యవీర్, వేదాంత్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు కూడా క్రికెట్‌లో తమ కెరీర్‌ను మొదలుపెట్టారు. సెహ్వాగ్ మరియు ఆర్తి మధ్య విడాకుల వార్తలు క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేశాయి.

గ్రే డివోర్స్ అంటే వృద్ధాప్యంలో విడాకులు తీసుకోవడం. గతంలో భారత దేశంలో గ్రే డివోర్స్‌కు ఎలాంటి స్థానం లేదు. గ్రే విడాకులలో ఒక ముఖ్యమైన అంశం స్త్రీలలో పెరుగుతున్న ఆర్థిక స్వాతంత్ర్యం. ఎక్కువ మంది మహిళలు వర్క్‌ఫోర్స్‌లోకి ఎంటర్ కావడం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ సాధించడం, ఆర్థిక భద్రత కోసం తమ జీవిత భాగస్వాములపై ఆధారపడక పోవడం ఈ నిర్ణయానికి కారణం కావచ్చు. వైవాహిక జీవితం కన్నా సెల్ఫ్ ఇంపార్టెన్స్ పెరిగినప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకునే ధైర్యం వస్తుంది. గ్రే డివోర్స్ అనేది 30, 40 ఏళ్ల వయసులో విడాకుల తీసుకునే దానికంటే భిన్నంగా ఉంటుంది. ఈ కాలంలో పురుషుడు, స్త్రీ ఇద్దరూ ఆదాయం పొందుతున్నారు.
ఈ సాంకేతికతలో, వారు సుమారు రెండు నుండి మూడు దశాబ్దాల పాటు బహుళ ఆస్తులను కలిసి సమీకరించారు. ఆస్తి విభజనలో చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. కోర్టు అలిమనీ, పెన్షన్ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. చట్టపరంగా, భారతదేశంలో హిందూ వివాహ చట్టం-1954 ఆధారంగా వివాహం కోర్టులో జరుగుతుంది. గ్రే డివోర్స్‌లో కోర్టు వివాహం వ్యవధి.. భర్త, భార్య వయస్సు, ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అలిమనీని నిర్ణయిస్తుంది.