దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. అయితే ఈ ఏడాది భారత్‌లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. ఈ లెక్కన బంగారం ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దేశంలో ఇటీవల బంగారం ధరలు అమాంత పెరిగిపోయాయి.
మేలిమి బంగారం ఏకగా రూ.73 వేలకు చేరుకుంది. అదృష్టం కొద్ది వారం రోజులుగా పసిడి పతనమవుతూ వస్తుంది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలు శాతం కూడా పెరిగిపోయింది. మహిళలక మరో శుభవార్త.. నిన్నటితో పోల్చుకుంటే పుత్తడి ధర ఓమోస్తారుగా తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు పై రూ.10 దిగివచ్చింది. ప్రస్తుతం రూ.66,690కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు పై రూ.10 దిగివచ్చింది. ప్రస్తుతం రూ.72,760 కి చేరింది.
ఏపీ, తెలంగాణలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.66,690కి వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు గోల్డ్ రేటు రూ.72,760 వద్ద కొనసాగుతుంది. దేశలోని ప్రధాన నగరాల్లో ఢిల్లీ 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.66,840 కి వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు గోల్డ్ రేటు రూ.72,910 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, పూణే, కేరళా లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.66,690 కి వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు గోల్డ్ రేటు రూ.72,760వద్ద కొనసాగుతుంది.
చెన్పైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.66,690 కి వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు గోల్డ్ రేటు రూ.72,760వద్ద కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర రూ.100 తగ్గింది. చెన్నై, కేరళా, హైదరాబాద్, వరంగల్, విజయవాడలో కిలో వెండి ధర రూ. 90,800, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 85,900, ముంబైలో రూ.85,900, బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.82,900 వద్ద కొనసాగుతుంది.