బంగారం ధరలు ప్రధానంగా అంతర్జాతీయ కారణాలవల్ల హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. బంగారం ధరలు ప్రధానంగా పెరగడానికి ముఖ్య కారణం పశ్చిమాసియా దేశాల్లో నెలకొని ఉన్న యుద్ధ వాతావరణమే ఒక కారణంగా చెప్తున్నారు. అంతర్జాతీయంగా వాణిజ్యం ఈ యుద్ధ వాతావరణం వల్ల దెబ్బతినే ప్రమాదం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అయితే ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటుంది. అక్టోబర్ 1వ తేదీన తులం బంగారంపై అతి స్వల్పంగా అంటే కేవలం పది రూపాయలు మాత్రమే తగ్గింది. దేశీయంగా ధరలను పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,790, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,230 వద్ద కొనసాగుతోంది.
అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,230 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,230 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,230 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,230 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,230 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,230 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,230 ఉంది. ఇక బంగారం ధర తగ్గుముఖం పడితే వెండి కూడా అదే దారిలో పయనిస్తోంది.
కిలో వెండిపై స్వల్పంగా అంటే వంద రూపాయలు మాత్రమే తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.94,900 వద్ద ఉంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో కీలక కదలికలు కనిపిస్తున్నాయి. గత నెల మొత్తం తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య కదలాడిన బంగారం.. ఇక సెప్టెంబర్ నెలలో స్వల్పంగా తగ్గుతూ వచ్చింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా ముందు, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ కూడా రాబోయే కాలంలో బంగారం ధరలు పెరగబోతున్నాయని, అందుకే పెట్టుబడిదారులు ఈ విలువైన మెటల్‌పై విశ్వాసం ఉంచాలని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.