మనలో చాలామందికి వినాయకుడు అంటే ఒక దేవుడు అని శివపార్వతుల కొడుకని మాత్రమే తెలుసు కాని ” వినాయకుడు ” అనే పదానికి ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏమిటంటే ” నాయకుడు లేనివాడు ” అని అర్థం. అంటే తనకు తనే నాయకుడు అని. అయితే సకల జీవుల్లో అంటే జంతువులు , పక్షులు, మొక్కలు ఇలా ప్రకృతి సమస్తంలో దైవం కనిపిస్తుందని హిందువులు భావిస్తారు.
పాము, ఏనుగు, కాకి, కుక్క అనే తేడా లేకుండా ప్రతి జీవిని దైవంగా భావించి పుజిస్తారు. ప్రకృతిలో అనేక వింతలు, విశేషాలు దర్శనం ఇస్తున్నాయి. అల్లం, బొప్పాయి, క్యారెట్ వంటి అనేక వస్తువులు విఘ్నాలకధిపతి వినాయక రూపంతో కనిపించి అనేక సార్లు భక్తులను అలరించాయి. అయితే తాజాగా ఓ ప్రకృతి వింతగా ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇందులో ఒక చెట్టు పచ్చని ఆకులతో నిండి కనిపిస్తుంది. అయితే ఒక కాండం నుంచి ఒక ఆకు వేలాడుతూ ఉంది. అయితే ఆ ఆకు ఓం కార రూపంలో ఉన్న వినాయకుడి దివ్వరూపం.. దీంతో వినాయక చవితి వేళ పరవశించిన ప్రకృతి.. ఒక ఆకు వినాయక రూపం దాల్చింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వైరల్‌గా మారింది. దీంతో ఈ వినాయకుడు ఉన్న వీడియోను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.