ఐదుగురు భర్తలు కలిగిన ద్రౌపదిని కూడా పతివ్రతే అంటారన్న విషయం కూడా మహాభారతం గురించి తెలిసిన అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఒకే భర్త గల స్త్రీ పతివ్రత అవుతుంది కానీ, ఐదుగురు భర్తలున్న ద్రౌపది పతివ్రత ఎలా అవుతుందని కొందరు వాదిస్తున్నారు. అయితే పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకున్న తర్వాత.. వారి మధ్య సాన్నిహిత్యాన్ని, గౌరవాన్ని కాపాడటానికి కొన్ని ప్రత్యేకమైన నియమాలు రూపొందించబడ్డాయి. ద్రౌపదికి ఐదుగురు పాండవులతో సమానమైన స్థానం ఉండాలని.. వారందరికి న్యాయం చేయాలని నిర్ణయించబడింది.
ఆమె ఒక్కో పాండవుడితో ఒక నిర్ణీత కాలం పాటు మాత్రమే ఉంటుందని.. ఆ సమయంలో ఇతర పాండవులు ఆమె గదిలో ప్రవేశించకూడదని నియమం రూపొందించబడింది. ఈ నియమం ఉల్లంఘించినప్పుడు గోప్యత భంగం జరుగుతుందని, తప్పించుకోలేని శిక్ష విధించబడుతుందని స్పష్టంగా నిబంధనగా పెట్టారు. ఒకరోజు.. అర్జునుడు అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. యుధిష్ఠిరుని గదిలో అతని విల్లు మరియు బాణాలు ఉంచబడ్డాయి. ఆ సమయంలో యుధిష్ఠిరుడు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్నాడు.
అర్జునుడు నియమాన్ని గుర్తుపెట్టుకున్నప్పటికీ తనకి అవి అత్యవసరం అయ్యాయి. కాబట్టి.. అతను గదిలోకి ప్రవేశించి వాటిని భయటకు తెచ్చుకున్నాడు. అయితే, ఈ చర్యతో అతను నియమాన్ని ఉల్లంఘించినట్లు స్పష్టమైంది. తన తప్పిదం తెలుసుకున్న అర్జునుడు.. నియమాలను గౌరవిస్తూ, శిక్షను స్వీకరించేందుకు ముందుకు వచ్చాడు. ఆ నియమం ప్రకారం.. అతనికి 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేయాల్సి ఉంది. ఈ అజ్ఞాత జీవితం అర్జునుడి కోసం కొత్త అనుభవాలకు, ప్రయాణాలకు మార్గం దారిచూపింది. వనవాసం కాలంలో అర్జునుడు ఎన్నో ప్రదేశాలను సందర్శించాడు. ఉలూపి అనే నాగ యువరాణిని, చిత్రాంగద అనే పాండ్య దేశపు యువరాణిని, సుభద్ర అనే శ్రీకృష్ణుని సోదరిని వివాహం చేసుకున్నాడు.
అతను తన ధనుర్విద్యను మరింత మెరుగుపరుచుకునే పనిలో నిమగ్నమయ్యాడు. శివుని ప్రసన్నం చేసుకుని పాశుపతాస్త్రం అనే శక్తివంతమైన ఆయుధాన్ని కూడా పొందాడు. ద్రౌపది ప్రతి పాండవుడితో సమానంగా సమయం గడిపేలా నియమాలు రూపొందించబడ్డాయి. కొన్ని కథనాల ప్రకారం.. ద్రౌపది ఒక్కో పాండవుడితో 72 రోజుల పాటు ఉండేది. కొన్ని ఇతర కథనాల ప్రకారం.. ఆమె ప్రతి పాండవుడితో ఒక సంవత్సరం పాటు గడిపేది. ఈ నియమం ద్రౌపదికి , పాండవులకు మానసిక ప్రశాంతతను కలిగించేలా రూపొందించబడింది. ఈ కథ ద్వారా పాండవుల పరస్పర గౌరవం, ధర్మానికి కట్టుబాటుపై మనం అర్థం చేసుకోవచ్చు.