పెళ్లి.. బర్త్ డే.. చావు.. సంతోషం.. విచారం.. కోపం..దు:ఖం.. బాధ..ఇలా ఎమోషన్ ఏదైనా మందేయాల్సిందే. చుక్క లేకుండా పండగలు పూర్తి కావు. అయితే మద్యం మితంగా తాగితే ఎలాంటి ప్రమాదం లేదు. కానీ అదే అలవాటుగా చేసుకుంటే మాత్రం దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు దరిచేరతాయి. అయితే వైన్, బీరు కలిపి తాగడం ఆరోగ్యానికి మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విభిన్న స్వభావాలు కలిగిన ఈ రెండు డ్రింక్స్ కలిపి తీసుకోవడం వల్ల సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు. ఇది మానవ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.. ఈ రెండూ కలిపి తీసుకుంటే ఆ వ్యక్తి త్వరగా మత్తులో మునిగిపోతాడని చెప్పారు. చివరికి, వారు హేతుబద్ధంగా ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోతారు. అంతేకాదు.. బీరు, వైన్ లేదా విస్కీ కలిపి తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది.

ముఖ్యంగా రాత్రిపూట తాగి పడుకుంటే, ఉదయం శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా డీహైడ్రేషన్ వల్ల మెదడు పనితీరు ప్రభావితమవుతుంది. ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే, అది శరీరం నుండి నీటిని బయటకు లాగుతుంది. విస్కీ, బీరు కలిపి తాగడం వల్ల వాంతులు, విరేచనాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. దీని కారణంగా ఛాతీలో మంట పెరుగుతుందని చెబుతున్నారు.
ఇది గుండెల్లో మంటకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. బీరు, విస్కీ కలిపి తాగడం వల్ల మూత్రపిండాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.