భార్యాభర్తల బంధం పారదర్శకతకు సంబంధించినది. భార్యా భర్తలిద్దరికీ ఒకరి గురించి మరొకరికి అన్నీ విషయాలు తెలుసుకోవాలి.. కానీ మహిళలు తన భర్తకు చెప్పని రహస్యాలు కొన్ని ఉన్నాయి. అయితే సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానున్న సినిమాలలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రాగా అనిల్ రావిపూడి విభిన్నంగా ఈ సినిమాకు ప్రమోషన్స్ చేస్తుండటం ఈ సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు.
ఫ్యామిలీ సినిమాలలో వెంకటేశ్ నటించిన ప్రతి సందర్భంలో ఈ హీరో ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా తాజాగా పూర్తైందని తెలుస్తోంది. భార్యకు, మాజీ ప్రేయసికి మధ్య ఇరుక్కున్న మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వెంకటేశ్ ఈ సినిమాలో కనిపించనున్నారు. భీమ్స్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా గోదారి గట్టు, మీనూ సాంగ్స్ హిట్ కావడంతో పాటు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకున్నాయి.
విక్టరీ వెంకటేశ్ బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ పాడిన పాట సైతం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ లో వెంకటేశ్ పెళ్లాలకు మాత్రం ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీలను చెప్పకండని చెబుతూ ఆకట్టుకున్నారు. అయితే ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. వెంకీ మామ చెప్పింది నిజమేనని సరదాగా లవ్ స్టోరీ చెప్పినా ఏదో ఒక సమయంలో ఇబ్బందులు తప్పవని కామెంట్లు వినిపిస్తున్నాయి.