చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తూ దీపావళి పండుగ జరుపుకుంటారు. అమావాస్య చీకటిని పారద్రోలుతూ తమ జీవితాల్లోకి వెలుగులు తీసుకురావాలని దీపావళి రోజు ఇల్లు మొత్తం దీపాలు వెలిగిస్తారు. దీపం ఉన్న ప్రదేశం ప్రకాశవంతం చేయడమే కాకుండా ఇంట్లోని ప్రతికూలతలను తరిమికొడుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అమావాస్య రాత్రి సూర్యాస్తమయానికి ముందు దీపావళి రోజున లక్ష్మీ దేవిని మరియు సంపదకు దేవత అయిన గణేశుడిని పూజిస్తారు.
అయితే జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం దీపావళి రోజున లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని చెపుతారు.. కాబట్టి ఈ ప్రత్యేకమైన రోజున లక్ష్మీ దేవిని 21 గవ్వలతో పూజించడం శుభప్రదం, దీని పాటు అమ్మవారికి పసుపు, ఆవాలు కూడా సమర్పించ వచ్చు. ఇలా పూజించిన తర్వాత దానిని ఎరుపు లేదా పసుపు వస్త్రంలో కట్టి, మీరు డబ్బు పెట్టిన చోట భద్రంగా ఉంచండి.

ఇలా చేయడం వల్ల మీ ఇంట సిరులు కురుస్తాయని పండితులు అంటున్నారు. ఇది కాకుండా దీపావళి రోజున.. మీరు కుండను నీటితో నింపి.. వంటగదిలో గుడ్డతో కప్పి ఉంచడండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుందంట. అలాగే ధనత్రయోదశి రోజున పసుపు, బియ్యాన్ని బాగా కలిపిసి.. ఇంటి గుమ్మం పై ఓం అని రాయాలి.
దీని కారణంగా లక్ష్మీ దేవి ఆ ఇంట స్థిర నివాసం ఉంటుందని పండితులు అంటున్నారు. నరక చతుర్దశి నాడు ఏనుగుకి చెరుకు లేదా స్వీట్స్ తినిపించడం కూడా ఎంతో ప్రయోజన కరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాని జ్యోతిష్కులు చెపుతున్నారు.