జూబ్లీ హిల్స్ లోని దిల్ రాజు ఇంటిలో సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు ఓ కీలక అడుగు వేశారు. దిల్ రాజుకు చెందిన శ్రీ వేంకటేశ్వర సినీ చిత్రకు సంబంధించిన ఆడిట్ రిపోర్టులతో పాటుగా బ్యాలెన్స్ షీట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా దిల్ రాజు సతీమణి తేజస్విని ఐటీ అధికారులు కొంత సేపు ప్రశ్నించారు. అయితే కేవలం దిల్ రాజు సంస్థపై మాత్రమే కాదు.. పుష్ప2 ప్రొడక్షన్ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలపై కూడా సోదాలు చేస్తున్నారు.
అంతేకాకుండా దిల్ రాజు సోదరుడు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సహా నిర్మాత శిరీష్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇక బలగం ప్రొడ్యూసర్, దిల్ రాజు కుమార్తె హన్సిత రెడ్డి ఇంటిని కూడా ఐటీ అధికారులు వదలలేనది సమాచారం.కాగా, ఒకే సారి దిల్‌రాజు కుటుంబంపై ఐటీ దాడులు జరగడంతో టాలీవుడ్ మొత్తం ఇదే టాపిక్ అయిపోయింది.

కాగా, తాజాగా దీనిపై దిల్ రాజు స్పందించారు. ఈ సోదాలు నా ఒక్క ఇంట్లో మత్రమే కాదు, మొత్తం ఇండస్ట్రీలోనే జరుగుతున్నాయని చెప్పాడు. విజయ్ దళపతి నటించిన వారసుడు సినిమాకు రూ.120 కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పాడు. ఈ సినిమాకు విజయ్‌కు రూ.40 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చామని అలాగే, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు రూ.60 కోట్ల నష్టపరిహారం చెల్లించాలమని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. రీసెంట్‌గా పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు.