Dengue: ఈ కాలంలో డెంగ్యూ జ్వరం రాకుండా ఉండాలంటే..! ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి.

divyaamedia@gmail.com
2 Min Read

Dengue: ఈ కాలంలో డెంగ్యూ జ్వరం రాకుండా ఉండాలంటే..! ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి.

Dengue: డెంగ్యూ జ్వరం డెంగ్యూ వైరస్ వల్ల వచ్చే దోమల వల్ల కలిగే వ్యాధి. లక్షణాలు సాధారణంగా సంక్రమణ తర్వాత మూడు నుండి పద్నాలుగు రోజుల తరువాత ప్రారంభమవుతాయి. ఇందులో అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు, కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మపు దద్దుర్లు ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడటానికి సాధారణంగా రెండు నుండి ఏడు రోజులు పడుతుంది. అయితే సాధారణ జ్వరంలా ఉన్నా కూడా ఇది చివరికి భయంకరంగా మారుతుంది. అయితే డెంగ్యూ వచ్చిన తర్వాత తగ్గించుకోవడం కంటే రాకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే వచ్చిన తర్వాత దీనిని నయం చేయడం చాలా కష్టం. కొంతమందికి తగ్గుతుంది. కానీ మరికొందరికి ప్రాణాల మీదకి తెస్తుంది.

Also Read: పారాసెటమాల్ వాడుతున్నారా..! అయితే తిప్పలు తప్పవు!

అదే డెంగ్యూ రాకుండా జాగ్రత్త పడితే ఎలాంటి సమస్యలు ఉండవు కదా. మరి డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. దోమలు కాటు వేయకుండా ఉండాలంటే చర్మంపై నిమ్మ యూకలిప్టస్ నూనెను వాడండి. ఇవి తప్పకుండా దోమలు కాటు వేయకుండా చూస్తాయి. అలాగే బయటకు వెళ్లినప్పుడు దోమలు కరవకుండా సరైన దుస్తులు ధరించండి. షార్ట్ డ్రస్సులు కాకుండా శరీరం మొత్తం కప్పి ఉంచేలా దుస్తులు ధరించడం వల్ల దోమ కాటును నివారించవచ్చు. నీరు నిల్వ ఉంటే దోమలు వ్యాప్తి చెందుతాయి. ఇంట్లో ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే తొలగించండి. ముఖ్యంగా పూల కుండీలు, కంటైనర్లను ఖాళీ చేయండి.

అలాగే నిద్రపోయేటప్పుడు దోమతెరలను వాడండి. సాయంత్రం పూట బయటకు వెళ్లడాన్ని తగ్గించండి. వర్షాలకు బయట దోమలు ఎక్కువ అవుతాయి. దీంతో మీకు కాటు వేస్తాయి. అదే బయటకు వెళ్లకుండా ఉంటే దోమల బెడద నుంచి తప్పించుకోవచ్చు. ఇంట్లోకి దోమలు రాకుండా తలుపులు, కిటికీలకు చిన్న తెరలను వాడండి. జ్వరం, దగ్గు, జలుబు వంటి ఏ చిన్న లక్షణం కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. లేకపోతే ప్రమాదం తప్పదు. ఇంట్లో కాయిల్సో, దోమల మందు వాడకుండా ఇంటి బయట వాటిని వాడండి.

Also Read: దోమలు కొందరినే టార్గెట్ చేసి ఎందుకు కుడతాయో తెలుసా..?

వర్షాకాలంలో గోడలపై తేమ ఉంటుంది. వీటిని క్లీన్ చేయండి. సరదాగా కూడా వర్షంలో తడవద్దు. బయట ఫుడ్‌కి దూరంగా ఉండటం మంచిది. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. అలాగే మాస్క్ వాడండి. ఈ కాలంలో కేవలం గోరువెచ్చని నీరు మాత్రమే తాగండి. చల్లని నీటికి దూరంగా ఉండండి. జలుబు చేసే పదార్థాలను అతిగా తినకండి. జలుబు చేస్తే ఆటోమెటిక్‌గా ఫీవర్ వస్తుంది. సీజనల్ కాబట్టి అది కాస్త వైరల్‌గా మారి డెంగ్యూ రావచ్చు. కాబట్టి వర్షాకాలంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *