ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే రూ.100 కోట్లతో కొత్త ఇల్లు కొన్న హీరోయిన్. అసలు విషయమేంటంటే..?

divyaamedia@gmail.com
2 Min Read

గత ఫిబ్రవరిలో, దీపికా పదుకొణే తాను గర్భవతి అని ప్రకటించి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది, ఆ తర్వాత ఆమె తన షూటింగ్‌ల నుండి పూర్తిగా విరామం తీసుకుని పూర్తి విశ్రాంతి తీసుకుంటోంది. అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే కనిపిస్తోంది. అయితే ఒక్కో సినిమాకు రూ.10 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటుంది. అటు సినిమాలు.. ఇటు యాడ్స్, బిజినెస్ రంగాల్లో భారీగా సంపాదిస్తుంది ఆ హీరోయిన్. కట్ చేస్తే .. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరో ఇంటి పక్కన ఖరీదైనా లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసింది.

ఆమె మరెవరో కాదు.. దీపికా పదుకొణె. కర్ణాటకలో జన్మించిన నటి దీపికా బాలీవుడ్‌లో నంబర్ 1 నటి. అలియా భట్ కంటే దీపికా పదుకొనే ఎక్కువ పారితోషికం తీసుకుంటోంది. ఇటీవలే అందమైన ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తోంది. దీపికా పదుకొణె, ఆమె భర్త రణవీర్ సింగ్ ఇండియాలోనే అత్యుత్తమ ఇళ్లల్లో ఒకటిగా పేరుపొందిన షారుఖ్ ఖాన్ ‘మన్నత్’ ఇంటి పక్కనే కొత్త ఇంటిని కొనుగోలు చేశారు.

ముంబైలోని ప్రతిష్టాత్మకమైన, ఖరీదైన ప్రాంతం అయిన బాంద్రాలో ఒక ఇంటిని కొనుగోలు చేశారు. ఈ ఇంటి విస్తీర్ణం 11,266 చదరపు అడుగులు. ఈ ఇంటి టెర్రస్ 1400 చదరపు అడుగుల వెడల్పుతో ఉంది. ఇది అపార్ట్మెంట్ ఇల్లు. మొత్తం నాలుగు అంతస్తులు. దీపికా, రణ్‌వీర్ సింగ్ 16వ అంతస్తు నుంచి 19వ అంతస్తు వరకు ఉన్న ఇంటిని కొనుగోలు చేశారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇంటి ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నారు. ఈ ఇంటి కోసం దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారట.

దీపిక, రణ్‌వీర్‌ సింగ్‌లు గతేడాది ఆగస్టులో కొత్త అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. అప్పట్లో దాదాపు 40 కోట్ల రూపాయలు చెల్లించి ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. ఇప్పుడు మరో కొత్త ఇల్లు కొన్నారు. అలాగే వీరికి బెంగళూరులో కొన్ని ఆస్తులు, అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లను కూడా కలిగి ఉన్నారు. ముంబై, హైదరాబాద్‌, జైపూర్‌లలో స్థిరాస్తి ఆస్తులను కూడా కలిగి ఉన్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *