కోళ్లకు వచ్చిన ఈ వ్యాధి కొత్తదేమి కాదు. నాలుగు సంవత్సరాల క్రితం ఈ వ్యాధి సోకి అనేక కోళ్లు మృత్యువాత పడ్డాయి. అప్పుడు ఎందుకు చనిపోతున్నాయో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో పెంపకందారులు తీవ్ర ఆవేదన చెందుతూ వచ్చారు. వైరస్ సోకడంతో అమ్మకాలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. అయితే ఎందుకంటే ప్రస్తుతం కోళ్లు అంతు చిక్కని వైరస్ బారిన పడుతున్నాయి.
ఈ వైరస్ ఎక్కువగా పశ్చిమగోదావరి జిల్లా కోళ్లను ప్రభావితం చేస్తోంది. గంట ముందు ఆరోగ్యంగా కనిపించే కోడి చనిపోతుంది. ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. అందులోనూ పందేలు కోసం పెంచిన కోళ్లు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నాయి. దీంతో చికెన్ తినే వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చికెన్ తినడం వల్ల మనుషులు కూడా చనిపోయే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ అంతు చిక్కని వైరస్ ఇప్పుడే కాదు.. నాలుగేళ్ల క్రితం కూడా వచ్చిందట. అప్పట్లో కూడా భారీ సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీ యజమానులు చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా ఏళ్ల తర్వాత వైరస్ తగ్గింది. ఇంతలో చాలా నష్టాలు చవి చూశారట. మరోసారి ఇప్పుడు ఈ వైరస్ రావడంతో పౌల్ట్రీ యజమానులతో పాటు చికెన్ ప్రేమికులు కూడా ఆందోళన చెందుతున్నారు.