అసలు చైతు – శోభిత ప్రేమ ఎలా మొదలైంది, వారి పరిచయం ఎలా అని చెప్పుకొచ్చారు. మొదట 2018 లోనే నాగార్జునకు సంబంధించిన ఓ ఈవెంట్లో ఈ ఇద్దరు క్యాజువల్ గా యాక్టర్స్ గా మొదటిసారి కలిసారట. అప్పటికి ఇద్దరికీ పరిచయం కూడా లేదు, ఆ తర్వాత కూడా మళ్ళీ కలవలేదు. చైతుకి సమంతతో 2021లో డైవర్స్ అయిన కొన్ని నెలల తర్వాత 2022 ఏప్రిల్ లో శోభిత నాగ చైతన్య పెట్టిన ఓ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి రిప్లై ఇచ్చిందట.
అయితే నాగచైతన్య – శోభిత ఇటీవల డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం, పెళ్లి ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత చైతన్య, శోభిత కలిసి న్యూయార్క్ టైమ్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో వీరి గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలో చైతు పెళ్లి ప్రపోజల్ గురించి మాట్లాడాడు. 2024 న్యూ ఇయర్ సమయంలో శోభిత చైతన్య కుటుంబాన్ని కలిసిందట.
ఆ తర్వాత చైతూ శోభిత కుటుంబాన్ని కలిశాడట. ఆగస్టులో వీరిద్దరూ గోవా ట్రిప్ కి వెళ్ళినప్పుడు అక్కడ చైతన్య శోభితకు పెళ్లి ప్రపోజల్ చేసాడట. అప్పటికే ఇద్దరూ ఒకర్నొకరు అర్ధం చేసుకొని ప్రేమలో ఉండి డేటింగ్ చేస్తుండటంతో శోభిత వెంటనే ఒప్పేసుకుంది. చైతు పెళ్లి ప్రపోజల్ చేసిన కొన్ని రోజులకే ఆగస్టు 8న వీరి నిశ్చితార్థం జరిగింది అని తెలిపారు. గతంలో నాగచైతన్య సమంత డెస్టినేషన్ వివాహం కూడా గోవాలోనే జరగడం గమనార్హం.