చాహల్‌కు అతని భార్య ధనశ్రీ వర్మతో విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఇద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. అంతే కాదు, ధనశ్రీకి సంబంధించిన ఫొటోలను కూడా చాహల్ సోషల్ మీడియా నుంచి తొలగించాడు. అప్పటి నుంచి వీరి విడాకుల గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ముంబైలోని ఓ హోటల్ నుంచి బయటకు వస్తూ.. చాహల్ తన ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని కనిపించాడు.
ఎందుకు అంటే.. అతని పక్కన ఓ అమ్మాయి ఉంది. ఆమె పేరు తనిష్క కపూర్ అని తెలుస్తోంది. కన్నడలో ఓ రెండు సినిమాలు చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఆమెతో చాహల్ తిరుగుతుండటంతో.. ఇదో హాట్ టాపిక్ అయిపోయింది. ధనశ్రీ పరిచయం కాకముందు చాహల్.. తనిష్కతో డేటింగ్ చేశాడని తెలుస్తోంది. మధ్యలో ఆమెను వదిలేసి.. ధనశ్రీకి దగ్గరయ్యాడని అంటారు.
కానీ.. ఈ వార్తల్ని అప్పట్లో చహల్ ఖండించాడు. కానీ ఇప్పుడు ఆమెతోనే తిరుగుతుండటంతో.. ఇప్పుడేమంటావ్ అని మీడియా ప్రశ్నిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం చాహల్.. తన భార్య ధనశ్రీ వర్మతో ఉండట్లేదని తెలుస్తోంది. అందుకే మళ్లీ మాజీ ప్రియురాలికి దగ్గరయ్యాడని వార్తలొస్తున్నాయి. వీళ్లిద్దరూ ముంబైలో కనిపించినప్పుడు చాహల్ పొడవైన టీ షర్ట్, లైట్ బ్లూ బ్యాగ్గీ జీన్స్‌లో ఉండగా.. ఆమె డార్క్ గ్రీన్ ఓవర్ సైజ్డ్ స్వెట్‌షర్ట్‌లో కనిపించింది.
ఆమధ్య ధనశ్రీ, చాహల్.. ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకున్నారు. దాన్ని ఫ్యాన్స్ కనిపెట్టడంతో.. ఫ్యామిలీ గుట్టు రట్టైంది. ఆ తర్వాత చాహల్.. తన అకౌంట్ నుంచి ధనశ్రీ ఫొటోలన్నీ డిలీట్ చేశాడు. ఆమె మాత్రం.. అతని కొన్ని ఫొటోలను తన అకౌంట్‌లో అలాగే ఉంచుకుంది.
Yuzvendra Chahal spotted with a mystery girl amid divorce rumors with Dhanashree Verma. Is this girl main reason behind separation? #YuzvendraChahal #dhanashreeverma pic.twitter.com/RiTzSWby3X
— बलिया वाले 2.0 (@balliawalebaba) January 7, 2025