Bike Stunt: రోడ్డుపై అమ్మాయి వేసుకొని హీరో అయిపోదాం అనుకున్నాడు, చివరికి ఏం జరిగిందో చుడండి.
Bike Stunt: ఎటువంటి ట్రాఫిక్ నిబందనలు పాటించకపోయిన వారిపై నూతన చట్టాల రీత్యా కటిన చర్యలు తీసుకొనబడును మరియు మైనరు పిల్లలకు వాహనాలు ఇచ్చిన వారిపై కూడా కటిన చర్యలు తీసుకొనబడునని తెలిపారు. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వచ్చాక పాపులర్ అయిపోదామని ఏవేవో వీడియోలు చేస్తూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒక్కరు.. ఇద్దరు.. చాలా మంది ఇంతే. ఎన్ని సార్లు చెబుతున్నా.. పోలీసులు హెచ్చరిస్తున్నా.. అబ్బే మా తీరు ఇంతే.. మేము ఫేమస్ అయిపోవాలి అని.. చివరికి పప్పులో కాలు వేస్తున్నారు.
Also Read: ఈ ఒక్క 1 రూపాయి నోటు మీ దగ్గర ఉంటే చాలు. మీరు కోట్లు సంపాదించవచ్చు.
రోడ్డుపై డ్యాన్సులు చేస్తూ.. విన్యాసాలు చేస్తూ.. చివరికి ఇరుక్కుంటున్నారు. రోడ్డుపై విన్యాసాలు చేస్తూ ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వీడియోలు ఒక్కటేంటీ.. వందల్లోనే చూస్తున్నాం. అయినా బుద్ధి లేకుండా చేస్తూనే ఉంటున్నారు. తాజాగా ఇలాంటి వీడియోనే ఓ కుర్రాడు రోడ్డుపై చేశాడు. పైగా వెనుక అమ్మాయిని ఎక్కించుకుని రీల్ చేద్దామనుకున్నాడు. చివరికి ప్రాణాలతో బయట పడ్డారు. ఈ వీడియోలో.. బైక్ పై వెనుక అమ్మాయిని వేసుకుని చక్కగా మేమే తోములం.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు అన్న ధీమాతో వెళ్తున్నారు.
ఇలాగే రోడ్డుపై ఓ స్టంట్ చేద్దాం.. హీరోగా ఫోజ్ ఇచ్చి.. వైరల్ అయిపోదాం అనుకున్నాడు అనుకుంటా.. కానీ చివరికి ఇది ఫెయిల్ అయింది. బండిని స్పీడుగా పైకి ఎత్తి.. పోనిస్తున్నాడు. అయితే అప్పుడే వెనుక ఉన్న అమ్మాయి ఒక్కసారిగా జారిపోయింది. అయితే కింద పడకుండా సీటు కిందు ఉన్న టైరుపై ఆగి ఒక్కసారిగా కేకలు పెట్టిది. దీంతో బండి ఆపాడు ఆ యువకుడు. అప్పుడే వెనుక నుంచి కారు కూడా వస్తుంది. ఆ అమ్మాయి జస్ట్ మిస్ అయి పక్కన పడి ఉంటే.. పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి వీరు లవర్సో కాదో తెలీదు.
Also Read: మీ ఆధార్ కార్డులో అడ్రస్ ఇలా సింపుల్ గా అప్‌డేట్ చేసుకోవచ్చు.
కానీ రోడ్డుపై ఇలా స్టంట్‌లు చేయకూడదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట జోరుగా వైరల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తూ తీవ్రంగా మండిపడుతున్నారు. ‘వీళ్లకు ఎన్ని సార్లు చెప్పినా బుద్ధి రాదు’.. ‘వ్యూస్ కోసం పిచ్చి పనులు చేస్తున్నారు’.. ‘ఆ అమ్మాయి జస్ట్ మిస్’.. ‘ఏదో చేద్దాం అనుకున్నాడు.. ఇంకేదో అయ్యింది’.. అంటూ ఇలా రక రకాల కామెంట్స్‌తో పాటు ఎమోజీలను కూడా షేర్ చేస్తున్నారు.