గత సీజన్లలో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్లుగా వచ్చిన ముమైత్ ఖాన్, సరయు, తేజస్వి మదివాడ, హమీదా స్మోకింగ్ చేస్తూ దొరికిపోయారు.. ఇక బిగ్ బాస్ 8 సీజన్లో కూడా పృథ్వి , నిఖిల్ దమ్ము కొడుతూ కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నాలుగు వారాలుగా హౌస్ చీఫ్ గా ఉన్న నిఖిల్ ఒత్తిడి తట్టుకోలేక ప్యాకెట్ల మీద ప్యాకేట్లు సిగరెట్లు కాల్చడం మనం చూడవచ్చు. అయితే స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వంటి భయానక రోగాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇక ఒత్తిడితో కూడిన జీవితాల్లో చాలా మంది ఉపశమనం కోసం స్మోకింగ్ ను ఆశ్రయిస్తుంటారు. ఇక బిగ్ బాస్ హౌస్ లోనూ ఇదే తంతు కొనసాగుతోంది.
గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా అడుగు పెట్టిన ముమైత్ ఖాన్, సరయు, తేజస్వి మదివాడ, హమీదా తదితర సెలబ్రిటీలు స్మోకింగ్ చేస్తూ దొరికిపోయారు. ఇక ఈ సీజన్ లోనూ పృథ్వీ, నిఖిల్ దమ్ముకొడుతూ కనిపించారు. ముఖ్యంగా నాలుగువారాల పాటు హౌస్ చీఫ్‌గా కొనసాగిన నిఖిల్ అయితే ఒత్తిడి తట్టుకోలేక ప్యాకెట్ల మీద ప్యాకెట్లను కాల్చేశాడు. ఈ వ్యసనం నుంచి అతడిని బయటపడేసేందుకు సోనియా ఆకుల బాగానే ప్రయత్నించింది. అందులో భాగంగానే స్మోకింగ్ మానేస్తే ఏదడిగినా ఇస్తానని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలైంది. దీని గురించి స్పందించిన సోనియా ‘ నిఖిల్ సిగరెట్ తాగడాన్నే చూపించారు.
కానీ హౌస్‌లో చాలామంది స్మోక్ చేస్తారు. అమ్మాయిలు కూడా స్మోక్ చేస్తున్నారు. కానీ, వాళ్లను మాత్రం చూపించట్లేదు. ఒక లేడీ కంటెస్టెంట్ అయితే ఒత్తిడి తట్టుకోలేక సిగరెట్ తాగుతా అంటే.. నేనే మంచిది కాదని చెప్పి మరీ ఆపేశాను. అయిత ఆ అమ్మాయి ఎవరనేది మాత్రం చెప్పను’ అంది సోనియా. సోనియా మాటలతో బిగ్ బాస్ ఆడియెన్స్ షాక్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో దమ్ము కొట్టే లేడీ కంటెస్టెంట్స్ ఎవరబ్బా అని ఆరా తీస్తున్నారు. ఇంతలో హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ సిగరెట్ తాగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.
ఇందులో కార్నర్‌లో సరిగ్గా గమనిస్తే.. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో ఉన్న విష్ణు ప్రియ.. స్మోకింగ్ ఏరియాలో కూర్చుని దమ్ము కొడుతూ కెమెరాల కంట పడింది. అయితే ఆమె విష్ణుప్రియ కాదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అలాగే అమ్మాయిలు సిగరెట్ తాగితే తప్పేంటని విష్ణుప్రియ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా విష్ణుప్రియకు సిగరెట్ తాగే అలవాటు ఉందని శేఖర్ బాషా సైతం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అమ్మాయిలు తాగితే తప్పేం లేదని కాకపోతే ఎవరైనా సరే ఈ అలవాటుకు దూరంగా ఉండటమే మంచిదన్నాడు.