నాగార్జున ఎలాంటి పాత్రనైనా చేస్తాడు అంటూ ఆయనకు ప్రేక్షకుల్లో ఒక ఆదరణ అయితే దక్కుతుంది. నిన్నే పెళ్ళాడుతా లాంటి సినిమాలో రొమాంటిక్ క్యారెక్టర్ లో కూడా నటించి మెప్పించాడు. నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఈయన తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న నలుగురు హీరోల్లో తను కూడా ఒకడిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు.
అయితే బిగ్ బాస్ 8వ సీజన్ కోసం నాగార్జున ఏకంగా రూ.30కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నారని టాక్ నడుస్తోంది. 7వ సీజన్ కోసం రూ.20కోట్లను నాగార్జున అందుకున్నారు. అయితే, ఈ కొత్త సీజన్ కోసం ఆయన రూ.10కోట్లు అధికంగా తీసుకోనున్నారట. అంటే ఓవరాల్ గా రూ. 30 కోట్లు నాగ్ అందుకోనున్నారన్నమాట.
ఒక టీవీ షోకు ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోవడమంటే మాములు విషయమేమీ కాదు. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్స్ ఎవరన్నది కూడా ఆసక్తికరంగా మారింది. సోనియా సింగ్, కుమారీ ఆంటీ, యాంకర్లు రీతు చౌదరి, విష్ణు ప్రియ, నటుడు ప్రభాస్ శీను, కమెడియన్ యాదమరాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
అలాగే యూట్యూబర్లు బంచిక్ బబ్లూ, అనిల్ గీలా, అలీ సోదరుడు ఖయ్యూం కూడా హౌస్ లోకి అడుగు పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది.