అప్పుడేమో బిగ్ బాస్‌తో స్టార్ డమ్..! ఇప్పుడేమో రోడ్డుపై బిచ్చగాడిలా.. షాక్ లో ఫ్యాన్స్.

divyaamedia@gmail.com
2 Min Read

యంగ్‌ హీరో కెవిన్‌ కథానాయకుడిగా తాను తెరకెక్కించిన ‘బ్లడీ బెగ్గర్‌’ చిత్రం డార్క్‌ కామెడీతో కూడిన డ్రామా థ్రిల్లర్‌ అని ఆ సినిమా దర్శకుడు శివబాలన్‌ ముత్తుకుమార్ అన్నారు. అయితే అయితే ఇప్పుడు ఒక యంగ్ హీరో సినిమా కోసం బిచ్చగాడిలా మారిపోయాడు. ఎంతలా అంటే ఆ హీరోను నిజమైన యాచకుడిగా భావించిన ఒక అమ్మాయి అతనికి రూ. 20 దానం చేసింది. పై ఫొటోలో ఉన్నది ఆ హీరోనే. ఇతను మన తెలుగు ఆడియెన్స్ కు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ తమిళ సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్.

ఈ యంగ్ హీరో పేరు కెవిన్. గతంలో తమిళ బిగ్ బాస్ షోలోనూ పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడీ హ్యాండ్సమ్ కుర్రాడు. ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. నాట్పున ఎన్నను తెరియుమా, లిఫ్ట్‌, దాదా, స్టార్‌ సినిమాలతో ఆడియెన్స్ ను మెప్పించాడు. కెవిన్ నటించిన దాదా తో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. అలాంటి హ్యాండ్సమ్ హీరో ఇప్పుడు ఒక సినిమా కోసం యాచకుడిలా మారాల్సి వచ్చింది. శివబాలన్‌ దర్శకత్వంలో కెవిన్ నటిస్తోన్న తాజా చిత్రం ‘బ్లడీ బెగ్గర్’. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది.

పేరుకు తగ్గట్టుగానే ఈ మూవీలో బిచ్చగాడిలా కనిపించాడు కెవిన్. కెవిన్ ను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. బెగ్గర్ పాత్ర లో అతను ప్రాణం పెట్టి నటించాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘వరుణ్ డాక్టర్’, ‘బీస్ట్’, ‘జైలర్’ సినిమాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న నెల్సన్ ఈ బ్లడీ బెగ్గర్ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్31న థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి తమిళ వెర్షన్ మాత్రమే థియేటర్లలోకి వస్తుంది. అయితే ఓటీటీలో మాత్రం తెలుగు వెర్షన్ కూడా రిలీజయ్యే అవకాశముంది.

ఈ సినిమా ప్రమోషన్లలో మాట్లాడిన కెవిన్ ‘.. ‘ నేను భిక్షగాడి గెటప్‌ వేసుకుని రోడ్డుపైకి వెళ్లాను. నన్నెవరైనా గుర్తుపడతారా? లేదా బిచ్చగాడినే అని నమ్ముతారా? అని నన్ను నేను పరీక్షించుకుందామనుకున్నాను. కానీ ఒకమ్మాయి నాకు రూ.20 దానం చేసింది. అప్పుడు నా లుక్‌పై నమ్మకం పెరిగింది’ అని చెప్పుకొచ్చాడు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *